YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

 పీహెచ్డీ చేయడానికి యాభై ఏళ్లు

 పీహెచ్డీ చేయడానికి యాభై ఏళ్లు

 పీహెచ్డీ చేయడానికి యాభై ఏళ్లు
అమరావతి డిసెంబ‌ర్ 11 
ఏపీ అసెంబ్లీ లో  స్పీకర్ కు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కు మధ్య మాటల తూటాలు పేలాయి. సాధారణంగా అధికార విపక్షాల మధ్య జరగాల్సిన ఎపిసోడ్ ఈ రకంగా జరిగింది.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం కి సంబంధించిన అంశం లో స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కు మధ్య మాటలు హోరెత్తాయి. ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశ పెట్టె అంశం లో సభలో చర్చ జరిగింది..ఈ అంశం రేపు స్వల్పకాలిక చర్చ ఉంది అని శాసన సభ వ్యవహారాల మంత్రి బుగ్గన చెప్పడంతో  అక్కడితో ఆగిపోయింది...ఇంతలో ఎమ్మెల్యే చెవిరెడ్డి లేచి చంద్రబాబు కు పి హెచ్ డి పూర్తి చేయడానికి 50 ఏళ్ళు పట్టింది అన్నారు. దీనికి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు.. రేపు చర్చ ఉంది కాబట్టి రేపు మాట్లాడాలి అన్నారు స్పీకర్. దీంతో ఇద్దరి మధ్య మాటలు పెరిగాయ్.సభ లో గందర గోళం ఏర్పడింది.స్పీకర్ చైర్ ను అవమానిస్తున్నారని సభ హోరెత్తింది. చంద్రబాబు సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు సభ్యులు... స్పీకర్  చైర్ ను కించపరిచేలా ప్రతిపక్ష నాయకుడు వ్యవహరిస్తున్నారన్నారు.  చివరకు  ఈ వివాదానికి  స్పీకర్ ఫుల్ స్టాప్ పెట్టారు. సభలో ఆవేశాలు ఉండకూడదన్నారు. .ప్రతిపక్ష నాయకుడు చేసిన కామెంట్స్ ఆయన విజ్ఞత కె వదిలి పెడుతున్న అన్నారు స్పీకర్.చివరకు స్పీకర్ వివాదాన్ని సర్దు బాటు చెయ్యడంతో సభ కూల్ అయింది. 

Related Posts