YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

మద్యాన్ని నిషేధించాలి  షాద్ నగరులో డీకే అరుణ దీక్షకు మద్దతుగా బీజేపీ నేతల సంఘీభావం 

మద్యాన్ని నిషేధించాలి  షాద్ నగరులో డీకే అరుణ దీక్షకు మద్దతుగా బీజేపీ నేతల సంఘీభావం 

మద్యాన్ని నిషేధించాలి 
షాద్ నగరులో డీకే అరుణ దీక్షకు మద్దతుగా బీజేపీ నేతల సంఘీభావం 
హైదరాబాదు కు తరలిన షాద్ నగర్ బిజెపి నాయకులు 
హైదరాబాద్ డిసెంబర్ 12, 
హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న బిజెపి నాయకురాలు మాజీ మంత్రి డీకే అరుణకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ భారతీయ జనతా పార్టీ నేతలు సంఘీభావం ప్రకటించారు. ఈ మహిళా సంకల్ప దీక్షకు పార్టీలు, మహిళా సంఘాలు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా బీజేపీ నేతలు పిలుపునిచ్చారు.గురువారం రైతు కాలనిలో డీకే అరుణ దీక్షకు మద్దతుగా స్థానిక బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున హైదరాబాద్ కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మధ్య నిషేదంపై ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజా సమస్యలను తెలంగాణ ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు. దిశా హత్యాచారం ఘటనపై దేశ ప్రజలు భగ్గుమంటున్నారని, మద్యం మత్తులో అనార్ధాలు జరుగుతున్నా సీఎం కేసీఆర్ మాత్రం  స్పందించడం లేదని నిప్పులు చెరిగారు. విచ్చలవిడి మద్యం అమ్మకాల వల్లే ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు.తెలంగాణలో మద్యం, డ్రగ్స్పై నిషేధం విధించాలని నేతలు డిమాండ్ చేశారు. మద్యం మత్తులోనే ఎక్కువ నేరాలు జరుగుతున్నాయని... రాష్ట్రంలో మద్యపాన నిషేధానికి సమయం ఆసన్నమైందని అన్నారు.   హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న డీకే అరుణకు తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ఈ మహిళా సంకల్ప దీక్షకు పార్టీలు, మహిళా సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమం కోసం మహిళలు కూడా పెద్దఎత్తున తరలి వస్తున్నారనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు రమణ, వంశి, నందిగామ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.  

Related Posts