YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 క్రియాశీలకంగా గవర్నర్ తమిళసై

 క్రియాశీలకంగా గవర్నర్ తమిళసై

 క్రియాశీలకంగా గవర్నర్ తమిళసై
హైద్రాబాద్, డిసెంబర్ 12,
గవర్నర్ తమిళ్ సై సౌందర్య రాజన్ రాజ్ భవన్ కే పరిమితం కాదలచుకోలేనట్లుంది. గవర్నర్ అంటే ఇలా ఉండాలి అని తమిళ్ సై కేసీఆర్ సర్కార్ కు చూపేలా ఉన్నట్లుంది. తమిళ్ సై సౌందర్య రాజన్ పక్కా భారతీయ జనతా పార్టీ నేత. ఆమె గవర్నర్ కాక ముందు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు నుంచి వచ్చిన తమిళ్ సై ఏపీలో బీజేపీ బలోపేతానికి కొంత ఊతమిస్తారని ముందుగా అందరూ ఊహించిందే.తెలంగాణ గవర్నర్ గా తమిళ్ సై సౌందర్య రాజన్ బాధ్యతలను స్వీకరించిన తర్వాత ప్రజా దర్బార్ ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అడపా దడపా ప్రయివేటు కార్యక్రమాలకు హాజరవుతున్న తమిళ్ సై తాజాగా నాలుగురోజుల పర్యటనను పెట్టుకున్నారు. ఈ పర్యటనలో దేవాలయాలతో పాటు వివిధ ప్రాజెక్టుల సందర్శన, డ్వాక్రా మహిళలతో సమావేశం వంటివి తమిళ్ సై ఫిక్స్ చేసుకున్నారు. ప్రజలతో తమిళ్ సై మమేకం కానున్నారు.నిజానికి ఆర్టీసీ సమ్మె తెలంగాణలో ఉధృతంగా జరుగుతున్నప్పుడే తమిళ్ సై ఆర్టీసీ ఉన్నతాధికారులను రాజ్ భవన్ కు పిలిపించుకుని మాట్లాడారు. ఆర్టీసీ యూనియన్ నేతలతో పాటు విపక్షాలకు తమిళ్ సై పలు దఫాలు అపాయింట్ మెంట్లు ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో తమిళ్ సై జోక్యం చేసుకున్నారనే చెప్పాలి. అయితే ఆ తర్వాత కేసీఆర్ గవర్నర్ వద్దకు వెళ్లి దాదాపు రెండు గంటల సేపు సమావేశమై రాష్ట్ర పరిస్థితులు, అసెంబ్లీ సమావేశాల వంటి విషయాలను చర్చించి వచ్చారు.గవర్నర్ గా నరసింహన్ ఉన్నప్పుడు పెద్దగా ప్రభుత్వంలో జోక్యం చేసుకున్నది లేదు. అయితే తమిళ్ సై మాత్రం తన పర్యటనలతో అధికార పార్టీలో అలజడి రేపుతున్నారనే చెప్పాలి. వరసగా నాలుగురోజుల పాటు తమిళ్ సై తెలంగాణలో పర్యటించనున్నారు. యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్నారు. తర్వాత వరంగల్ లో ఒక ప్రయివేటు కార్కక్రమంలో పాల్గననున్నారు. తర్వాత డ్వాక్రా మహిళలు, గిరిజనులతో సమావేశమయ్యారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తారు. ఇలా గవర్నర్ తమిళ్ సై తెలంగాణాలో నాలుగు రోజుల పర్యటన ఆసక్తిరేపుతోంది. అధికార పార్టీలో కొంత అలజడి రేగిందనే చెప్పాలి. గవర్నర్ పర్యటనలో అధికార పార్టీతో పాటు బీజేపీ నేతలు ఎక్కడిక్కడ పాల్గొంటున్నారు.

Related Posts