YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఓరుగల్లుకు మోనోరైలు

ఓరుగల్లుకు మోనోరైలు

కాజీపేట-వరంగల్‌ మధ్య రాకపోకలు 
ప్రపంచంలోనే ప్రత్యేకంగా ఉండేలా హైదరాబాద్‌ 
ప్రాజెక్టు పరిశీలనకు మంత్రి కేటీఆర్‌ స్విట్జర్లాండ్‌ పర్యటన 

తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్‌లో మోనోరైలు సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఆలోచనలు ఆరంభమయ్యాయి. ఇక్కడ ఐటీ రంగం విస్తరణకు ఇప్పటికే అడుగులు పడ్డాయి. ఇదే క్రమంలో ప్రపంచస్థాయి రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు సర్కారు యోచిస్తోంది. ‘‘కాజీపేట, వరంగల్‌ మధ్య 15 కిలోమీటర్ల మేర రైలు నడిపేందుకు... స్విట్జర్లాండ్‌కు చెందిన ఇంటర్నేషనల్‌ కామన్‌ కంట్రీస్‌ సిస్టమ్‌, పోలాండ్‌కు చెందిన ఐడీస్‌ సంస్థలు సంయుక్త అధ్యయనం నిర్వహించాయి. ఆయా ప్రతిపాదనలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. గురువారం ఆయన ‘ఈనాడు’తో మాట్లాడుతూ- హైదరాబాద్‌, వరంగల్‌ నగరాల్లో మోనోరైలు సేవల్ని ప్రారంభించేందుకు జరుగుతున్న ఏర్పాట్లను వివరించారు. ‘రాష్ట్రంలో మోనోరైలు సేవల్ని ప్రారంభించేందుకు రెండు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ‘నిర్మించు-నిర్వహించు-అప్పగించు’ పద్ధతిలో ప్రాజెక్టు చేపడతామన్నాయి. హైదరాబాద్‌, వరంగల్‌లో ప్రాథమిక సర్వే చేపట్టాయి. స్విట్జర్లాండ్‌లో అందిస్తున్న సేవలను సమీక్షించి, చర్చించి, నిర్ణయం చెబుతామని కేటీఆర్‌ చెప్పార’ని రామ్మోహన్‌ తెలిపారు. విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి ఆదివారం స్విట్జర్లాండ్‌కు వచ్చి, ప్రతిపాదిత సంస్థలతో భేటీ అవుతారనీ.. ఆ సమావేశానికి తాను కూడా వెళ్తున్నానని మేయర్‌ చెప్పారు.

ఒకేసారి 2 వేల మంది ప్రయాణం: హైదరాబాద్‌లో 70 కిలోమీటర్ల మోనోరైలు కారిడార్లకు ప్రతిపాదనలొచ్చాయి. ఇందులో- గచ్చిబౌలి, కొండాపూర్‌, ఆదిభట్ల మీదుగా శాటిలైన్‌ టౌన్‌షిప్‌లను కలుపుతూ విమానాశ్రయం వరకూ కారిడార్‌ ఉంది. ఎల్బీనగర్‌ మెట్రో కారిడార్‌-విమనాశ్రయం, జేబీఎస్‌-విమానాశ్రయం తదితర కారిడార్లున్నాయి. వేర్వేరు దేశాల్లోని మోనోరైళ్లు ప్రస్తుతం ఒక ట్రిప్పులో 600-700 మంది ప్రయాణికులనే గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. వీటికి భిన్నంగా ఒక్కో రైలులో 2వేల మంది ప్రయాణించేందుకు వీలైన ప్రాజెక్టును చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా, ఆయా సంస్థలు అంగీకరించినట్లు రామ్మోహన్‌ తెలిపారు.

Related Posts