వివేకా హత్యను సీబీఐకి అప్పగించాలి
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి డిమాండ్
కడప డిసెంబర్ 12,
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ అధికారుల విచారణ కొనసాగుతోంది. మాజీ మంత్రి, భాజపా నాయకుడు ఆదినారాయణరెడ్డిని అధికారులు గురువారం నాడు దాదాపు గంటపాటు విచారించారు. ఆయనతో పాటు వైఎస్ వివేకానందరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ వివేకా హత్య కేసులో భాగంగా తనను పిలిచారన్నారు. హత్య రోజు తాను విజయవాడలో ఉన్నానన్నారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. ఈ కేసులో తన ప్రమేయం లేదని అన్నారు. ‘ హత్య కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో 30 ప్రశ్నలు అడిగారు. అన్నింటికీ సవివరంగా సమాధానమిచ్చా. ఈ కేసులో నా తప్పు ఉంటే బహిరంగంగా ఉరితీయాలని చెప్పానని అన్నారు. అప్పట్లో సీబీఐ కావాలని జగన్ హైకోర్టులో రిట్ వేశారన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత ఎందుకు సిట్ వేశారు? అని ప్రశ్నించారు. అన్ని పార్టీలు సీబీఐ కావాలని కోరుతున్నాయన్నారు. వివేకాను ఎవరు హత్య చేశారో అందిరి మనస్సాక్షికి తెలుసని చెప్పా. కావాలనే అందర్నీ ప్రశ్నిస్తున్నారు. సీబీఐ విచారణ కావాలి.. ఇదే మా డిమాండ్ అని ఆదినారాయణరెడ్డి పే