సబ్సిడీ ఉల్లి కేంద్రాల ఏర్పాటుకై కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐ ధర్నా
వనపర్తి డిసెంబర్ 12
వనపర్తి జిల్లాలో సబ్సిడీపై 15 రూపాయలకు కిలో ఉల్లిగడ్డ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని ఇంచార్జ్ డిఆర్ఓ వెంకటయ్య అందజేశారు. వినతి పత్రం లోని సమస్యలప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాననిఇంచార్జ్ డీఆర్వో తెలిపారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ వనపర్తి జిల్లా గౌరవ అధ్యక్షులు సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి డి చంద్రయ్య మండల సిపిఐ కార్యదర్శి రమేష్ మాట్లాడతూ జిల్లాలో ఉల్లి ధర రకాన్ని సైజు లు బట్టి 80 రూపాయల నుంచి 120 వరకు విక్రయిస్తున్నారని, తల్లిలాంటి ఉల్లిని కొనలేక ఘాట్ కు సామాన్యుడి కంటనీరు వస్తుందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సాగుబడి తగ్గటం దిగుమతి తగ్గటం తదితర ధర పెరిగిందని ,ఎప్పుడు తగ్గుతుందో తెలియదన్నారు. సమస్య కొంతవరకు తీరుతుందన్నారు. గతంలో ప్రభుత్వాలు ఉల్లి ధర పెరిగినప్పుడు ఈ రకమైన చర్యలు చేపట్టారని ,ఈ సారి పట్టించుకోవడం తగదన్నారు. కొత్త ఉల్లి పంట పండి మార్కెట్లో ధరలు తగ్గేదాకా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని అమ్మాలని డిమాండ్ చేశారు. పక్కల ఉన్న ఆంధ్రప్రదేశ్ లో సబ్సిడీపై ఉల్లిగడ్డ అమ్ముతున్న సంగతిని గుర్తించాలన్నారు. రాష్ట్రం లో బియ్యం తప్ప పప్పులు నూనెలు చింతపండు ఎల్లిపాయ ఇతర నిత్యావసర వస్తువుల ధరలు అడ్డు అదుపు లేకుండా పెంచి అమ్ముతున్న పట్టించుకునే నాథుడే లేడన్నారు. కూరగాయల ధరలు మండి పోతున్నాయని విమర్శించారు. కూరగాయల వ్యాపారులు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలకు అనేక కారణాలు చెబుతున్న సామాన్యుడి నడ్డి విరుగపతోంది అన్నారు. ధరల పెరుగుదలతో సామాన్యుడి తిండి ఖర్చు రోజువారీగా భరించలేని స్థితికి చేరిందన్నారు. ఉల్లి నిత్యావసరాల ధరలు అదుపుకు బ్లాక్ మార్కెటింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు పి కళావతమ్మ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జె చంద్రయ్య మండల కార్యదర్శి రమేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు జె నరేష్ నాయకులు సంతోష్ వంశీ తదితరులు పాల్గొన్నారు.