YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

బీసీ విద్యార్థులు, బీసీ హాస్టల్ల పట్ల ప్రభుత్వం వివక్షత

బీసీ విద్యార్థులు, బీసీ హాస్టల్ల పట్ల ప్రభుత్వం వివక్షత

బీసీ విద్యార్థులు, బీసీ హాస్టల్ల పట్ల ప్రభుత్వం వివక్షత
హైదరాబాద్ డిసెంబర్ 12
బీసీ విద్యార్థుల పట్ల, బీసీ హాస్టల్లో పట్ల ప్రభుత్వం వివక్ష - చిన్నచూపు చూస్తోందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. రాష్ట్రంలోని 700 బి.సి హాస్టల్లకు గత ఐదు నెలలుగా మెస్ బిల్లులు బడ్జెట్ ఇవ్వకపోవడంతో కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. హాస్టళ్ళు మూసి వేస్తామని వార్డెన్లు అంటున్నారు. వెంటనే బడ్జెట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు బీసీ భవన్ లో  బీసీ సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షులు నీలా వెంకటేష్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వివిధ బీసీ సంఘాలకు చెందిన బీసీ నాయకులు అల్లంపల్లి రామ్ కోటి, జి.కృష్ణ యాదవ్, శంకర్ గుండేటి, అనంతయ్య తదితరులు ప్రసంగించారు.కాలేజీ హాస్టళ్ళ సొంత భవనాలు నిర్మించలేదు. వర్కర్లను వార్డెన్ లను నియమించలేదు. రాష్ట్రంలోని 271 బీసీ కాలేజీ హాస్టళ్ళు ఉండగా ఒక్కదానికి కూడా సొంత భవనం లేదు. ఇక వార్డెన్ కొరత గురించి చూస్తే ఒక్కొక్క వార్డెన్ మూడు-నాలుగు హాస్టళ్లకు ఇన్ఛార్జ్ గా ఉంటె తలకు మించిన భారం పడుతుంది. అలాగే 200 మంది విద్యార్థులకు  ఉన్న ఇద్దరు వర్కర్ల పని చేయలేక పారిపోతున్నారన్నారు.
మెస్ బిల్లులు, కరెంటు బిల్లులు, అద్దెలు, కాస్మోటిక్ ఛార్జీలు, ఇతర చార్జీలు గత కొన్ని నెలల నుండి విడుదల చేయడం లేదు. హాస్టల్ వార్డెన్లు వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి హాస్టళ్ళు నడిపిస్తున్నారు. లక్షల రూపాయలు అప్పులు పెరగడం మూలంగా హాస్టల్ నడవడం కష్టంగా మారింది. వెంటనే బడ్జెట్ విడుదల చేయకపోతే హాస్టళ్ళు మూసివేస్తామని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 69 పాఠశాల బీసీ హాస్టళ్ళలో విద్యార్థుల సంఖ్య లేదనే కారణంతో మూసివేశారు. పాఠశాల హాస్టళ్లలో సంఖ్య లేకపోతే కాలేజీ హాస్టల్ గా మార్చాలని ప్రభుత్వం  జీవో జారీ చేసింది.  కాని జి.ఓ అమలు చేయడం లేదని విమర్శించారు.
త్వరలో జరగబోయే మునిసిపల్ ఎన్నికలలో గతంలో మాదిరిగా బీసీలకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు ఎన్నికలు జరగబోయే 129 మున్సిపాలిటీలలో 43 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లు, 4 కార్పొరేషన్లు బీసీలకు కేటాయించాలని కోరారు. రిజర్వేషన్లు తగ్గిస్తే బి.సి మంత్రుల – ఎంఎల్ఏ ల పని పడుతామని హెచ్చరించారు. అనంతరం బీసీ ఇక్యవేదిక రాష్ట్ర అద్యక్షులు అల్లంపల్లి రామ్ కోటి మాట్లాడుతూ టి.ఆర్.ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బీసీ రిజర్వేషన్లు తగ్గించే కుట్రలు చేస్తుందని విమర్శించారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీరాజ్-మునిసిపల్ ఎన్నికలలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు  చేస్తామని ప్రకటించారు. మన రాష్ట్రంలో తగ్గించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. 2010లో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టుకొని బీసీల గొంతు కోస్తున్నారని విమర్శించారు. 2010లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత 2013లో ఉమ్మడి రాష్ట్రంలో 34 శాతం అమలు చేశారు. ఇప్పుడు పక్క రాష్ట్రమైన ఏపీ-కర్ణాటక కూడా 34 శాతం అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం మున్సిపల్ పట్టణాలలో బీసీ జనాభా 50 శాతంకు పైగా ఉంది, కానీ అధికారులు తక్కువ చూపిస్తున్నారని కృష్ణయ్య  అన్నారు. 50 శాతం సీలింగ్ కు కాలం చెల్లింది. పార్లమెంట్ లో ఈబిసి లకు 10 శాతం రిజర్వేషన్లు పెట్టి 60 శాతం కు గరిష్ట పరిమితి పెంచారు. ఇప్పటికి అనేక రాష్ట్రాలలో 50 శాతం దాటి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. తమిళనాడులో 69 శాతం – మహారాష్ట్ర లో 70 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అలాంటప్పుడు ఇక్కడ 50 శాతం సీలింగ్ ఎందుకని పప్రశ్నించారు.ఇటీవల జరిగిన గ్రామ పంచాయితీ, ఎం.పీ.టీ.సీ, జడ్పీటీసీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతం తగ్గింఛి, బీసీ నాయకత్వం ఎదగకుండా కుట్రలు చేశారని విమర్శించారు. గతంలో మాదిరిగా యధాతథంగా అమలు చేయడానికి అవకాశం ఉన్న ఉద్దేశపూర్వకంగా  బి.సి కులాలను రాజకీయంగా అణచి వేయడానికి తగ్గించారు. ఇలా తగ్గించడం వలన 2400 సర్పంచ్ పదవులు, 30 వేల వార్డు మెంబర్లు, 1800 ఎం.పీ.టీ.సీలు, 90 జెడ్.పి.టి.సి, లో 85 ఎం.పీ.పీ లు, 6 జడ్పీ పి లు బీసీలకు కావలసినవి దక్కకుండా పోయాయని విమర్శించారు. బి.సిలు ఉద్యమించడానికి సిద్దం కావాలని రామ్ కోటి పిలుపుచిచ్చారు.

Related Posts