YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

డయల్ యువర్ జె.సికు 12 వినతులు  సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు

డయల్ యువర్ జె.సికు 12 వినతులు  సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు

డయల్ యువర్ జె.సికు 12 వినతులు 
సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు
శ్రీకాకుళం, డిసెంబర్ 12 
 డయల్ యువర్ జె.సి కార్యక్రమానికి 12 వినతులు వచ్చాయి. గురువారం కలెక్టర్ కార్యాలయంలో డయల్ యువర్ జె.సి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు నిర్వహించి పలువురు ఫోన్ కాలర్స్ అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు.  సారవకోట మండలం చీడిపూడి నుండి డి.ధర్మారావు మాట్లాడుతూ తమ వద్ద 300 బస్తాలకు పైగా ధాన్యం ఉందని, కొనుగోలు చేసేందుకు ఎవరూరాలేదని, వాటిని ఏ విధంగా విక్రయాలు చేయాలని కోరగా జె.సి బదులిస్తూ తమ సమీపంలోని పి.పి.సిలో వివరాలు నమోదుచేసుకోవాలని, ఇందుకు తేమ శాతాన్ని లెక్కించేందుకు కేజీ ధాన్యంతో పాటు తమ ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకంలోని మొదటి పేజీ, పట్టాదారు పాసు పుస్తకం లేదా యల్.ఇ.సి కార్డు లేదా టెన్ వన్ కాపీలో ఏదో ఒక దానిని తప్పనిసరిగా తీసుకువెళ్లాలని సూచించారు. వివరాలు నమోదుచేసుకున్న అనంతరం సిబ్బంది వచ్చి కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.  శ్రీకాకుళం మండలం బమ్మిడివానిపేట నుండి పి.రాజారావు ఫోన్ చేస్తూ తమ ధాన్యాన్ని పి.పి.సిలకు తీసుకువెళ్తే రవాణా ఛార్జీలు చెల్లిస్తామని ప్రభుత్వం ఇస్తున్న మాట వాస్తవమేనా అని అడిగిన ప్రశ్నకు జె.సి బదులిస్తూ రైతుల కల్లాల వద్దకే సిబ్బంది వచ్చి కొనుగోలు చేయడం జరుగుతుందని, ఆ విధంగా కాకుండా నేరుగా పి.పి.సిల వద్దకు ధాన్యాన్ని తీసుకువెళ్లినట్లయితే అందుకయ్యే రవాణా ఖర్చులను ప్రభుత్వమే చెల్లించడం జరుగుతుందని స్పష్టం చేసారు. వంగర మండలం కొండ చాకిరిపల్లి నుండి బి.సత్యంనాయుడు ఫోన్ చేస్తూ ధాన్యం కల్లాల్లోనే ఉండిపోయాయని, వాటిని కొనుగోలు చేసేందుకు పనులను వేగవంతం చేయాలని కోరగా జె.సి బదులిస్తూ ఇప్పటికే జిల్లాలో పి.పి.సిలను ఏర్పాటుచేసి కొనుగోలు చేయడం జరుగుతుందని, వంగరలోని వెలుగు పి.పి.సినకు వెళ్లి వివరాలు సమర్పించినట్లయితే తక్షణమే కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. జలుమూరు మండలం తిమడాం నుండి యం.మల్లేశ్వరరావు మాట్లాడుతూ తమ వద్ద 200బస్తాలకు పైగా ధాన్యం ఉందని, అల్లాడ పి.ఏ.సి.యస్ ఇంతవరకు ప్రారంభించలేదని, కావున వీటిని ఎక్కడకు తీసుకువెళ్లాలని కోరగా సిబ్బందిని పంపి కొనుగోలు చేయిస్తామన్నారు. 
 సంతకవిటి మండలం గారనాయుడుపేట నుండి కె.సీతారామ్ మాట్లాడుతూ మా ఇంటి వద్ద ధాన్యం నిల్వ ఉండటంతో ఎలుకల బెడద ఎక్కువగా ఉందని, పి.పి.సిలు ధాన్యం తీసుకోకపోవడం వలన నష్టం వాటిల్లుతుందని తెలియజేయగా పి.ఎ.సి.యస్ వారిని ఈ రోజులోపే పంపి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.  శ్రీకాకుళం రూరల్ మండలం కరజాడ నుండి వెంకటరమణ ఫోన్ చేసి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఏ విధంగా అమ్మాలో తెలియజేయాలని కోరగా , తమ దగ్గరలోని పి.పి.సిలకు వెళ్లి తమ వివరాలను నమోదుచేసుకున్న అనంతరం కల్లాల వద్దకే వచ్చి ధాన్నాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని జె.సి తెలిపారు.  భామిని మండలం వడ్డంగి నుండి బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ధాన్యాన్ని రైసు మిల్లర్లు తీసుకోవడం లేదని, ఈ సమస్యను పరిష్కరించాలని జె.సిని కోరగా తక్షణమే సిబ్బందిని పంపి కొనుగోలు చేస్తామని జె.సి బదులిచ్చారు. సారవకోట మండలం లక్ష్మీపురం నుండి పి.వి.రమణ మాట్లాడుతూ బుడితి గ్రామంలో గల మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఫిర్యాదు చేయగా పి.పి.సి సిబ్బందిని పంపి కొనుగోలు చేస్తామని జె.సి హామీ ఇచ్చారు ఆమదాలవలస మండలం బొడ్డేపల్లిపేట నుండి బి.సుగుణ మాట్లాడుతూ ధాన్యాన్ని ఎవరూ తీసుకోవడంలేదని ఫిర్యాదు చేయగా తమ సమీపంలో పి.పి.సిలో వివరాలు అందించినట్లయితే తక్షణమే కొనుగోలు చేయడం జరుగుతుందని జె.సి పేర్కొన్నారు.  నందిగాం మండలం దిమ్మిడిజోల నుండి కె.ఫల్గుణరావు ఫోన్ చేస్తూ తమ గ్రామానికి పి.పి.సి లేదని, కావున దానిని ఏర్పాటుచేయాలని కోరగా జె.సి స్పందిస్తూ తమ సమీపంలోని పి.పి.సిలో వివరాలు సమర్పించాలని కోరారు.  కంచిలి మండలం రేఖాదేవీపురం నుండి బి.బసవరాజు మాట్లాడుతూ తమ గ్రామంలో పి.పి.సిలేదని, దాంతో ఎవరూ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఫిర్యాదు చేయగా  తక్షణమే సిబ్బంది వచ్చి కొనుగోలు చేస్తారని చెప్పారు.  రేగిడి ఆమదాలవలస మండలం కె.వెంకటాపురం నుండి పి.జగన్నాధంనాయుడు మాట్లాడుతూ ధాన్యాన్ని ఎక్కడికి తీసుకువెళ్లాలో తెలియడంలేదని కోరగా, రేగిడిలోనే పి.పి.సిని ప్రారంభించడం జరిగిందని, ఆ కేంద్రంలో వివరాలు నమోదుచేసుకున్నట్లయితే సిబ్బంది వచ్చి కొనుగోలు చేస్తారని జె.సి బదులిచ్చారు. 

Related Posts