YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

జగన్, కేసీఆర్ సంతాపం

జగన్, కేసీఆర్ సంతాపం

జగన్, కేసీఆర్ సంతాపం
విజయవాడ, డిసెంబర్ 12, 
ముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు మృతిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొల్లపూడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు. సినిమాల్లో తనదైన శైలితో వినూత్నమైన డైలాగ్‌ డెలివరీతో, రచనల్లో, నాటకాల్లో ఆకట్టుకున్నారని.. బహుముఖ ప్రజ్ఞాశాలిగా గొల్లపూడి సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో గర్వించదగిన స్థానాన్ని సంపాదించారన్నారు.గొల్లపూడి మారుతీరావు గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మారుతి రావుకు ముగ్గురు కుమారులు. ఆయన కుమారుడు శ్రీనివాస్‌ దర్శకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. అయితే షూటింగ్‌ సమయంలో జరిగిన ప్రమాదంలో శ్రీనివాస్‌ మరణించారు. తరువాత ఆ సినిమాను గొల్లపూడి స్వీయ దర్శకత్వంలో పూర్తి చేశారు. తనయుడి జ్ఞాపకార్థం ఉత్తమ దర్శకులకు జాతీయ అవార్డును అందజేస్తూ వస్తున్నారు గొల్లపూడి.మారుతీరావు 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించారు. చిన్నతనంలో కళారంగంవైపు అడుగులు వేసిన ఆయన.. కాలేజీ రోజుల్లోనే నవలలు, నాటకాలు రాసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు. సినిమాల్లోకి రాకముందు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో రేడియో ప్రయోక్తగా, జర్నలిస్ట్‌గా కొంతకాలం పనిచేశారు. 250కి పైగా సినిమాల్లో నటించిన గొల్లపూడి ఆరు నంది అవార్డులు అందుకున్నారు

Related Posts