YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా

పొలిటికల్ ఎంటర్ టైన్మెంట్ గా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు

పొలిటికల్ ఎంటర్ టైన్మెంట్ గా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు

పొలిటికల్ ఎంటర్ టైన్మెంట్ గా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు
హైద్రాబాద్, డిసెంబర్ 12,
స్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖుల పాత్రలను ఆధారంగా చేసుకుని రామ్ గోపాల్ వర్మ సమర్పణలో తెరకెక్కిన వివాదాస్పద చిత్రం ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’. కొంత మంది ప్రముఖ రాజకీయ నాయకుల పాత్రలను టార్గెట్ చేస్తూ సెటైరికల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దారు. అసలు ఈ సినిమా విడుదలవుతుందో లేదో అనే ఉత్కంఠ నేపథ్యంలో నాటకీయ పరిణామాల మధ్య బుధవారం సాయంత్రం సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చింది. మొత్తానికి గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన 2019 ఎన్నికల్లో వెలుగు దేశం పార్టీ (వీడీపీ)పై ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుంది. 151 సీట్లతో జగన్నాథ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అధికారాన్ని కోల్పోయిన వీడీపీ పార్టీ అధినేత బాబు, ఆయన తనయుడు చినబాబు, పార్టీ నేతలు ఓటమిని జీర్ణించుకోలేక ప్రభుత్వాన్ని ఎలాగైనా దెబ్బకొట్టాలని చూస్తుంటారు. మరోవైపు సీఎం జగన్నాథ రెడ్డికి ప్రజాదరణ పెరిగిపోతూ ఉంటుంది. బాబుకు అత్యంత ఆప్తుడు అయిన దయనేని రమా ప్రభుత్వంపై, సీఎంపై తీవ్ర ఆరోపణలు చేస్తారు. జగన్‌పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పోగొట్టేలా ఆధారాలు సృష్టిస్తూ ఉంటారు. ఈ క్రమంలో బెజవాడ బెంజ్ సర్కిల్‌లో ప్రజలంతా చూస్తుండగానే దయనేని రమాను కొంత మంది దారుణంగా హత్య చేస్తారు. అసలు ఈ హత్య ఎవరు చేశారు? ఈ హత్య వెనుక సీఎం హస్తం ఉందా? లేకపోతే ప్రతిపక్షమే ఈ హత్య చేయించిందా? అనేదే సినిమా.ఆంధ్రప్రదేశ్ 2019 ఎన్నికల తరవాత చోటుచేసుకున్న పరిణామాలను ఆధారంగా చేసుకుని ఒక కల్పిత కథను తెరపై చూపించారు దర్శకుడు సిద్ధార్థ తాతోలు. ప్రీ ఇంటర్వెల్ వరకు మనకు తెలిసిన కథనే సెటైరికల్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా చూపించారు. తెలిసిన కథే అయినా ఆ క్యారెక్టర్లతో పండించిన ఎంటర్‌టైన్మెంట్‌ను ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇక ఇంటర్వెల్‌ బ్యాంగ్‌లో దయనేని రమా హత్యతో కథ మలుపు తిరుగుతుంది. తరవాత ఏం జరుగుతుంది అనే ఆసక్తి ప్రేక్షకుడిలో పెరుగుతుంది.ఇంటర్వెల్ దగ్గర క్రియేట్ చేసిన ఆసక్తిని దర్శకుడు సెకండాఫ్‌లో కొనసాగించలేకపోయారు. తెలిసిన కథను బాగానే తెరకెక్కించారు కానీ.. కల్పిత కథను సరిగా అల్లలేకపోయారు. సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు బాగా బోర్ కొట్టిస్తాయి. అయితే, మధ్యలో పీపీ జాల్‌ను రంగంలోకి దించి నవ్వించే ప్రయత్నం చేశారు. కథను దయనేని రమా చుట్టూ తిప్పినా చివరికి వచ్చేసరికి ఆ హత్య ఎవరు చేయించారు అనే విషయం మాత్రం చెప్పలేదు. అది ఒక రాజకీయ హత్యగానే చూపించారు. దాని చుట్టూ తిరిగిన రాజకీయాన్ని మాత్రమే సినిమాగా చూపించారు.సినిమాలోని ప్రతి పాత్రను చాలా ఆసక్తికరంగా మలిచారు దర్శకుడు. ప్రతి పాత్రలోనూ ప్రస్తుత రాజకీయాల్లో ఉన్న ప్రముఖుల ప్రతిబింబాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. అంతమంది ఆర్టిస్టులను వెతికి పట్టుకున్న రామ్ గోపాల్ వర్మ, ఆయన శిష్యుడు సిద్ధార్థ తాతోలును అభినందించకుండా ఉండలేం. అయితే, వారికి చెప్పించిన డబ్బింగ్ మాత్రం కాస్త ఇబ్బంది పెడుతుంది. చిన్న పాత్రలకు చెప్పిన డబ్బింగ్ చాలా బాగా కుదిరింది కానీ.. ప్రధాన పాత్రలకు చెప్పిన డబ్బింగే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది.మనసేన పార్టీ అధినేత ప్రణయ్ కళ్యాణ్ పాత్రను మాత్రం కేవలం సెటైర్ వేయడానికి మాత్రమే పెట్టినట్టు ఉంది. కథలో ఆయన్ని పెద్దగా ఇన్వాల్వ్ చేయలేదు. అప్పుడప్పుడు కనిపిస్తూ రెండు మూడు డైలాగులు చెప్పి వెళ్లిపోయారు. బ్రహ్మానందం పాత్రకైతే ఒకే ఒక్క డైలాగ్ ఇచ్చారు. అది కూడా సినిమా ఆఖర్లో. స్పీకర్ పమ్మినేనిగా ఆలీ అదరగొట్టారు. బాగా నవ్వించారు. పీపీ జాల్ పాత్రలో రాము తన విశ్వరూపం చూపించాడు. ఆయనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడంతో బాగా కుదిరింది. ధన్‌రాజ్, కత్తి మహేష్, స్వప్న తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు.టెక్నికల్‌గా సినిమాను హై క్వాలిటీతో తెరకెక్కించారు. ముఖ్యంగా కెమెరా వర్క్ చాలా బాగుంది. విజయవాడ సిటీ డ్రోన్ షాట్స్ అయితే అద్భుతం. డైలాగులు కూడా సెటరైకిల్‌గా బాగా రాశారు. రవి శంకర్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.మొత్తంగా చూసుకుంటే వివాదాస్పద కంటెంట్‌తో కూడిన ఒక సెటైరికల్ ఎంటర్‌టైనర్‌ను రామ్ గోపాల్ వర్మ అండ్ కో తెలుగు ప్రేక్షకులకు అందించింది. ఈ సినిమా ద్వారా ఒక నీతిని కూడా తెలియజేశారు వర్మ. ‘‘రాజకీయాల్లో అయినా, మీడియాలో అయినా, సినిమాల్లో అయినా ప్రజలకు కావాల్సింది కేవలం ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే’’ అని వర్మ స్వయంగా చెప్పిన మాటలతో సినిమాకు శుభం కార్డు వేశారు.

Related Posts