30 మంది హీరోయిన్లను వేధించాడు
లాస్ ఏంజిల్స్, డిసెంబర్ 12,
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముప్ఫై మంది నటీమణులను లైంగికంగా వేధించాడు ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్‌స్టైన్. రెండేళ్ల క్రితం ఓ నటి హార్వే ఎలాంటివాడో బయటపెట్టి హాలీవుడ్‌లలో మీటూ ఉద్యమానికి తెర లేపింది. ఆ తర్వాత ఎందరో నటీమణులు తామూ హార్వే వల్ల లైంగికంగా వేధించబడినవాళ్లమేనంటూ మీడియా ముందుకు వచ్చారు. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్‌ని కూడా హార్వే లైంగకంగా వేధించాలనుకున్నాడట. కానీ అప్పట్లో ఐష్ మేనేజర్ అలాంటివేమీ జరగకుండా జాగ్రత్తపడ్డారట.తనపై ఆరోపణలు చేసి కోర్టులో కేసులు వేసిన బాధితులకు డబ్బులిచ్చి డీల్ కుదుర్చుకోవాలనుకున్నాడు హర్వే. ఈ విషయాన్ని తన లాయర్ల ద్వారా మీడియా ముందు వెల్లడించాడు. మొత్తం 176 కోట్ల 71లక్షల 25వేలు ఇచ్చి డీల్ కుదుర్చుకోవాలని అనుకుంటున్నాడు. అయితే తన సంపాదన నుంచి హార్వే ఈ డబ్బును ఇవ్వడంలేదు. తన ప్రొడక్షన్ కంపెనీకి ఉన్న బీమా డబ్బులతో డీల్ కుదుర్చుకున్నాడు. ఇందుకు కేసులు వేసిన వాళ్లు కూడా ఒప్పుకుంటే తాను చేసిన నేరాలను హార్వే కోర్టులో కూడా ఒప్పుకోవాల్సిన అవసరం ఉండదట.హార్వే చేత లైంగికంగా వేధించబడిన హాలీవుడ్ నటి కేథరీన్ కెండల్ ఈ డీల్ గురించి మీడియాతో మాట్లాడారు. తనకు ఏమాత్రం నచ్చలేదని, చేసిన తప్పులకు హార్వేకి శిక్ష పడి తీరాల్సిందేనని అన్నారు. అయితే ఈ విషయంలో తానొక్కత్తే పోరాడితే ఇతర బాధితులకు జరిమానా రాకుండాపోతుందని మౌనంగా ఉంటున్నానని తెలిపారు. హార్వే విషయంలో డబ్బు తీసుకుని మౌనంగా ఉండటం తప్ప తానేమీ చేయలేకపోతున్నానని వెల్లడించారు. అయితే డీల్ ఇష్టంలేని బాధితులను బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకోమని పలువురు న్యాయవాదులు హెచ్చరించారు.హార్వే బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్‌పైన కూడా కన్నేశాడు. ఓసారి ఐశ్వర్యను ఒంటరిగా తన గదిలో కలవాలనుకుంటున్నానని హార్వే ఐష్ ఇంటర్నేషనల్ టాలెంట్ మేనేజర్‌తో అన్నాడట. అతని వక్ర బుద్ధిని ముందే పసిగట్టిన సదరు మేనేజర్ అలాంటివేమీ కుదరవని చెప్పేశారట. ‘చాలాసార్లు ఐశ్వర్యను మీటింగ్‌కి పిలిచేవాడు. నేను కూడా వెళ్లేదాన్ని. నన్ను బయటికి వెళ్లమనేవాడు. కానీ నేను వెళ్లేదాన్నికాదు. ఓసారి నేరుగా నా వద్దకు వచ్చి ఐశ్వర్యను ఒంటరిగా కలవడం ఎలా అని అడిగాడు. నీకంత సీన్ లేదు అని చెప్పాను. దాంతో చాలా సార్లు నన్ను బెదిరించాడు. నేను హార్వేతో ఏం చెప్పానో మీకు చెప్పలేను కానీ ఐశ్వర్యపై వాడి నీడను కూడా పడనివ్వలేదని చెప్పగలను’ అని తెలిపారు.