YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

గ్రామ పంచాయతీ కార్మికులకు తెరాస అండ

గ్రామ పంచాయతీ కార్మికులకు తెరాస అండ

గ్రామ పంచాయతీ కార్మికులకు తెరాస అండ
హైదరాబాద్ డిసెంబర్12,
గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనం రూ. 8500కు పెంచినందుకు టీఆర్ఎస్ కార్యక విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞత సభ గురువారం జరిగింది. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎం.శ్రీనివాస్ రెడ్డి, రూప్ సింగ్, రాంబాబుయాదవ్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ  కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు ఉపన్యాసాల పార్టీలు, ఎక్కడ మంది కూడితే అక్కడికి వెళ్లి తోచినట్లుగా మాట్లాడతారు. ఆ పార్టీల మాయలో పడొద్దు. - గ్రామపంచాయతీలను బాగు చేస్తున్నది, జీపీ ఉద్యోగుల కోసం ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే.  సీఎం కేసీఆర్ మనసున్న మారాజు. ప్రజల, కార్మికుల సమస్యల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బాగా తెలుసు .  ఏన్నో ఏళ్ల నుంచి గ్రామపంచాయతీ కార్మికులు తక్కువ వేతనాలతో ఇబ్బందులు పడ్డారు. నెలకు రూ.500 నుంచి రూ.1500 మాత్రమే వచ్చేవి. పేరుకు జీపీ కార్మికులు అయినా జీవనం గడవుపుకునేందుకు ఇతర కూలీ పనులకు వెళ్లేవారని అన్నారు.  సీఎం కేసీఆర్  అన్ని ఆలోచించి జీపీ కార్మికుల వేతనాలను రూ.8500గా నిర్ణయించారు.  దశల వారీగా అందరి, అన్ని సమస్యలను పరిష్కరించేలా సీఎం కేసీఆర్గారు నిర్ణయాలు తీసుకుంటారు.  కారోబార్ హోదాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునేలా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం.  జీపీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ గారికి అందరు కృతజ్ఞత చూపాలి. పల్లె ప్రగతిని విజయవం చేసినట్లుగానే నిత్యం గ్రామాభివృద్ధి పని చేసి ఆకృ తజ్ఞతను చూపాలని అన్నారు.  గ్రామపంచాయతీ వ్యవస్థను బాగు చేయాలి. ప్రతి రూపాయి సమర్థవంతంగా ఖర్చు చేసేలా చూడాలి.- ప్రతి గ్రామంలో వైకుంటధామాలు, డంపింగ్ యార్డులు, ఇంకుడు గుంతలను నిర్మించేలా చర్యలు తీసుకోవాలి. గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ గారు ప్రతి నెల రూ.339 కోట్లు ఇస్తున్నారు.  మన రాష్ట్రానికి నిధుల విడుదల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గత ఐదేళ్లలో మన రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి 2 లక్షల 71 వేల కోట్లు ఇస్తే... కేంద్ర ప్రభుత్వం కేవలం 34 వేల కోట్లు ఇచ్చింది.  గత ప్రభుత్వం కనీసం ఆలోచన కూడా చేయని ఎన్నో పథకాలను సీఎం కేసీఆర్గారు విజయవంతంగా అమలు చేసి చూపించారు.  కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, 24 గంటల కరెంటు... ఇలా అన్ని చేసి చూపించారని అన్నారు.  

Related Posts