YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

ఘాటెక్కిన ఉల్లిధర - భారీగా పెరిగిన ధరల పై కాంగ్రెస్ పార్టీ నిరసన  ఆసిఫాబాద్

ఘాటెక్కిన ఉల్లిధర - భారీగా పెరిగిన ధరల పై కాంగ్రెస్ పార్టీ నిరసన  ఆసిఫాబాద్

ఘాటెక్కిన ఉల్లిధర - భారీగా పెరిగిన ధరల పై కాంగ్రెస్ పార్టీ నిరసన 
ఆసిఫాబాద్ డిసెంబర్ 12  
కాగజ్ నగర్ లోని అంబేద్కర్ చౌరస్తా నుండి మార్కెట్ వీధుల గుండా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. ఉల్లిగడ్డ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగడుతూ ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని నిన్నటికి నిన్న ఉల్లిధర కిలో 100 రూపాయల నుంచి 200 రూపాయలు పలికిందని , ఇది పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్ల అని అన్నారు. ఉల్లిగడ్డ ధరల విషయం గురించి బీజేపీ కానీ, తెరాస ప్రభుత్వం కానీ కనీసం మాట కూడా మాట్లాడటం లేదని వారికి చీమ కుట్టినట్టు కూడా లేదని కావున ఈ విధానాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టినమని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దిగివచ్చి మార్కెట్ లలో 25 రూపాయల ధర ఉండే విధంగా చూడాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ డా పాల్వాయి హరీష్ బాబు ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఓబీసీ చైర్మన్ దాసరి వెంకటేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ దస్తగిరి, మాజీ కౌన్సిలర్లు సిందం శ్రీనివాస్, దెబ్బటి శ్రీనివాస్, షబ్బీర్, మహేష్, బాల్క శ్యామ్, మైనార్టీ జిల్లా చైర్మన్ యునుస్, గన్నారం సర్పంచ్ శ్రీనివాస్, ఎంపిటిసి తిరుపతి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు షేరు పఠాన్, ఇమ్రాన్, వేణు, దీపక్,సత్తిబాబు, జమీర్, మొండి, మధుకర్, పురుషోత్తం, అనంత్ రావు, హరీష్, సత్తిబాబు, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts