కన్నుల పండుగగా "వేంకటేశ్వరుని కళ్యాణం"...
కొల్లాపూర్, డిసెంబర్ 12 (న్యూస్ పల్స్)
ఆపద మొక్కుల వాడు అనాధ రక్షకుడు ఏడుకొండల రాయుడు శ్రీ అలువేలు మంగ సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం గురువారం భక్తుల జయజయ నాధాల మధ్యన మంగళ వాయిద్యాల మద్య వేద పండితుల మంత్రోక్షణల మధ్యన రంగ రంగ వైభవం గా రామాపూర్ లో జరిగినది.కొల్లాపూర్ మండలం లోని రామాపూర్ గ్రామం దగ్గరి గుట్ట పై వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ 13 వ వార్షికోత్సవం సందర్భం గా గురువారం స్వామి వారి కళ్యాణోత్సవం జరిగినది.ఆలయ ధర్మ కర్త జూపల్లి రమా రవీందర్ రావు,ధరణి పతి శ్రీనువాసరావు,శ్రీ పతి రావు దంపతులు గ్రామస్థులు స్వామి వారి కళ్యాణోత్సవం ను నిర్వహించారు.ఆలయ కమిటీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆలయ కమిటి సభ్యుల అద్వర్యం లో స్వామి వారి కళ్యాణోత్సవం కు భారీ ఏర్పాట్లు చేశారు.వివిద గ్రామాల నుండి వచ్చిన వేలాది భక్తులు స్వామి వారి కళ్యాణోత్సవం లో పాల్గొని తిలకించారు.స్వామి వారికి " చదివింపులు" చదివించుకొన్నారు.కానుకలు సమర్పించారు.స్వామి వారి కళ్యాణోత్సవం తిలకించేందుకు వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ వారు అన్నదానం ఏర్పాట్లు చేశారు.కొల్లాపూర్ ఆర్టీసీ డిపో అధికారులు స్వామి వారి కళ్యాణోత్సవం తిలకించేందుకు వచ్చిన భక్తుల కొరకు కొల్లాపూర్ నుండి రామాపూర్ గుట్ట పైకి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడిపారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వాహనాల పార్కింగ్ లను కొల్లాపూర్ ఎస్,ఐ మురళి గౌడ్,ఏ ఎస్ ఐ లక్ష్మయ్య పోలీస్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ శాంతిభద్రతల పర్యవేక్షణ ను చేపట్టారు.