గర్భిణి అయిన సీతమ్మను పరిత్యజించడం శ్రీరాముడికి ధర్మమా?
ఈ అనుమానం సహజంగా మనలో అందరికీ చాలా సహజంగా ఉంటుంది. కానీ అక్కడే మనం చాలా విపులంగా వాల్మీకి రామాయణాన్ని పరిశీలిస్తే రాముని రాజనీతికి- పూర్ణమైన ధార్మికతకు, వ్యక్తిత్వ ఔన్నత్యానికీ అద్దం పడుతుంది ఆ సందర్భం. అదెలా అంటే:
"ఏడాదిపాటు పరాయి వాని చరలోఉండివచ్చిన సీతను రాముడిలా స్వీకరించాడు?" అనే అపవాదు తన అర్ధాంగికి అసలు రానేకూడదు అని అగ్నిప్రవేశం చేయించాడు. కానీ దాన్నికూడా లక్షపెట్టని ప్రజల వల్ల సీతమ్మతల్లి లోకాపవాదానికి గురికావలసివచ్చింది.(కేవలం ఒక్క చాకలివాని మాటే కాదు, అయోధ్యా ప్రజలందరూ).
ఆ సందర్భంలో
శ్రీ రాముని ముందు వున్నవి రెండే మార్గాలు..
1. సీతమ్మ కోసం రాజ్యాన్ని విడిచిపెడ్డడం...
2 . రాజధర్మం కోసం సీతమ్మను విడిచిపెట్టడం...
ఇందులో ఏ ఒక్కటైనా రాముని స్వధర్మానికి విరుద్ధం. ఇలాంటి క్లిష్టపరిస్తితుల్లోనే మనకు ధర్మ సూక్ష్మాలు వివరించారు మన ఋషులు... "ధర్మసూక్ష్మం" అంటే ఒకవ్యక్తి రెండు పరస్పరవిరుద్ధధర్మాల మధ్య చిక్కుకుని మార్గంతోచక పరితపించే క్రమంలో అతనికి వాటి మధ్యలో ధార్మికమైన మార్గాన్ని చూపించే సూక్షమైన తర్కాలు(Logic's) అన్నమాట. ఇక్కడ రాముడు చేసిందికూడా అంతే.
సీతమ్మ తన అర్ధాంగి, కేవలం తన ఒక్కని సొత్తు, తన వ్యక్తిగతం. కానీ అయోధ్యా సింహాసనం తన ఒక్కడి సొత్తు కాదు. వంశపారంపర్య సంక్రమణం.
ఆ కాలంలో రాజనీతిని అనుసరించి ఒక రాజు తన ప్రజలకు సుస్థిరమైన, జనరంజకమైన పాలన అందించడానికి అవసరమైతే తన వ్యక్తిగత సౌఖ్యాన్ని, ప్రాణాన్ని కూడా పణంగా పెట్టాలి అన్న ధర్మానికి కట్టుబడితే సీతా పరిత్యాగం రాజా రాముని ధర్మానికి సమ్మతం.
అలా కాదని సీతాదేవికోసం సింహాసనాన్ని విడిచిపెడితే తన వ్యక్తిగత సౌఖ్యం కోసం వంశపారంపర్యమైన ఆనవాయితీని, రాజధర్మాన్ని కూడా తప్పినవాడవుతాడు.... అది స్వాయంభువ మనువు నుండి తన తండ్రి దశరధుని వరకు తన పితరులందరికీ తీరని కళంకాన్ని, అధోగతినీ తెస్తుంది...
కనుక ఒక రాజారామునిగా సీతా పరిత్యాగంతో తన జీవిత సర్వస్వాన్నీ తానే విడిచిపెట్టవలసిన స్థితి రామునిది. కనుకనే అలా చేసాడు. అదికూడా నట్టడవిలో కాదుఋషయాశ్రమాల దగ్గర్లో.
ఏమిటీ తనకంత నమ్మకం?
.శ్రీ రాముని వారసత్వం తన గర్భంలో ఊపిరిపోసుకుని వుండగా "సీతమ్మ తన ప్రాణాన్ని" తీసుకునే
సాహసం ఒక్కనాటికీ చెయ్యదు.
.తన పాతివ్రత్య మహిమచేతను, ఋష్యాశ్రమాల తపో బలముచేతను సీతమ్మ ఖచ్చితంగా
రక్షింపబడుతుంది. ఇవి రామునికి చాలా బాగా తెలుసు.
ఇక ఏదో ఓనాటికి తన ప్రజలకు కనువిప్పుకలిగించి తన సీతను తన ప్రక్కకు తెచ్చుకోవచ్చు అన్న ఆశ. అందుకే జీవితాంతం "సీతను" తప్ప మరో ఆడదాన్ని తన ఊహలోకి కూడా రానివ్వలేదు.
కనుక కట్టుకున్న భార్యని-పూర్ణ గర్భిణిని అడవులపాలు చేసిన కఠినాత్ముడు రాముడు అని మనం వేలెత్తి చూపగలిగినంత అల్పుడు కాడు శ్రీరాముడు అని గుర్తించండి.
అందుకే ఎప్పటికీ "శ్రీ రాముడంటే"...
రామో విగ్రహవాన్ ధర్మస్సాధుస్సత్యపరాక్రమః
రాజా సర్వస్య లోకస్య దేవానాం
(శ్రీమద్వాల్మీకిరామాయణం)৷৷
భావం:
శ్రీ రాముడు మూర్తీభవించిన ధర్మము,మహోన్నతుడు, సత్యమే పరాక్రమంగా కలిగిన ధీశాలి. దేవతలకు ఇంద్రునివలె ఆయన అఖిలలోకానికీ ప్రభువు.
జై శ్రీమన్నారాయణ