YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీని భయపడుతున్న జేబుదొంగలు

టీడీపీని భయపడుతున్న జేబుదొంగలు

టీడీపీని భయపడుతున్న జేబుదొంగలు
అనంతపురం, డిసెంబర్ 13,
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జిల్లా సమీక్షలకు వెళుతున్నారు. తెలుగు తమ్ముళ్లలో జోష్ నింపేందుకే ఆయన పర్యటనలు సాగుతున్నాయి. ఈ సమావేశాలకు కొందరు నేతలు హాజరుకాకపోయినా కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. మూడున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ నుంచి నేతలు వెళ్లిపోయినా ఆ పార్టీ అభిమానులు మాత్రం జెండాను వదలరన్న సంగతి తెలిసిందే.అయితే ఈ సందర్భంగా చంద్రబాబు జిల్లా సమీక్షల్లో ఫ్రీగా ఉండటంతో ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఎక్కువగా ద్వితీయ శ్రేణి నేతలు పోటీ పడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు దగ్గరగా కూడా వెళ్లలేని వారు ప్రతిపక్ష నేతగా ఉండటంతో తమకు అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని సెల్ఫీలు దిగేందుకు, చంద్రబాబును శాలువాతో సత్కరించేందుకు అన్ని జిల్లాల సమీక్షల్లో తీవ్రమైన పోటీ కన్పిస్తుంది. దీంతో చంద్రబాబు భద్రతపై కూడా ఆందోళన నేతల్లో కలుగుతుంది.అయినా చంద్రబాబు మాత్రం అభిమానులు, కార్యకర్తలతో ఫొటోలు దిగేందుకు ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. కార్యకర్తలను అదుపు చేయడం పోలీసులకు కూడా కష్టసాధ్యమవుతోంది. దీనికి తోడు జేబు దొంగల బెడద ఎక్కువగా ఉందంటున్నారు. అందుకే జిల్లా సమీక్షలకు వెళ్లాంటే తెలుగు తమ్ముళ్లు హడలిపోతున్నారట. కార్యకర్తలతో పాటు కలిసిపోయిన జేబుదొంగలు వారి చేతివాటం చూపిస్తుండటంతో లక్షల రూపాయల ధనం జేబుదొంగల పాలవుతుందని లబో దిబో మంటున్నారు.చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ, కడప, నెల్లూరు, కర్నూలు జిల్లాల సమీక్షలను నిర్వహించారు. అన్ని జిల్లాల్లోనూ జేబుదొంగల బెడద ఎక్కువగా ఉందని, అనేక మంది సొమ్ముతో పాటు సెల్ ఫోన్లను కూడా పోగొట్టుకున్నారని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కొందరు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారట. అయితే జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు సూచించారట. చంద్రబాబు జేబులో సెల్ ఉండదు, పర్సు ఉండదని, అందుకే ఆయనను దొంగలు వదిలిపెట్టారని సెటైర్లు వేసుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఈ నెల 18వ తేదీ నుంచి జరిగే అనంతపురం జిల్లా సమీక్షలోనైనా దొంగల బెడద లేకుండా చూడాలని సీనియర్ నేతలు పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. తెలుగు తమ్ముళ్లూ జేబుదొొంగల పట్ల జర జాగ్రత్తగా ఉండాలి.

Related Posts