YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

క్యాన్సర్ పేషంట్ల బాధలు ఇంతింతకాదయా

క్యాన్సర్ పేషంట్ల బాధలు ఇంతింతకాదయా

క్యాన్సర్ పేషంట్ల బాధలు ఇంతింతకాదయా
హైద్రాబాద్, డిసెంబర్ 13,
ఇటీవల కాలంలో మళ్లీ క్యాన్సర్‌ రోగుల సంఖ్య అమాంతం పెరిగిపోతున్నది.  పాతికేండ్లలో పెరిగిన రోగుల సంఖ్యను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తున్నది. 1990లో ఒక లక్ష మంది జనాభాలో 54 మంది క్యాన్సర్‌ రోగులుండే వారు. ప్రస్తుతం ఇది 72కు పెరిగినట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. అయితే పెరిగిన రోగుల సంఖ్యకు తగ్గట్టుగా ప్రభుత్వపరంగా చికిత్స కోసం మాత్రం పెరగడం లేదు. రాష్ట్రంలో ఏకైక ఎం.ఎన్‌.జే.క్యాన్సర్‌ ఆస్పత్రి మాత్రమే అందుబాటులో ఉండడంతో రోగులకు మెరుగైన సౌకర్యాలను అందించలేకపోతున్నది. దీంతో రోగులు అనివార్యంగా ప్రయివేటు ఆస్పత్రుల దోపిడీకి గురవుతున్నారు. పెరుగుతున్న రోగుల సంఖ్యను గమనంలోకి తీసుకున్న కార్పొరేట్‌ ఆస్పత్రులు పోటాపోటీగా క్యాన్సర్‌ చికిత్స కోసం ప్రత్యేక విభాగాలను ప్రారంభించి, ఒక్కో రోగి నుంచి లక్షలాది రూపాయలను సంపాదించుకుంటున్నాయి. క్యాన్సర్‌పై కార్పొరేట్‌ ఆస్పత్రుల టర్నోవర్‌ ఏడాది వందల కోట్ల రూపాయల్లో ఉంటున్నదని విశ్లేషకులు అంచనా. కీమోథెరపీ దశకు చేరుకున్న క్యాన్సర్‌ రోగులకు ఒక్కొక్కరికి తక్కువలో తక్కువగా రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతున్నాయి. దీనిని భరించలేని పేద రోగులు ఎక్కువగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ను ఆశ్రయిస్తున్నా, అక్కడ కూడా సగానికి మించి ఆర్థిక సాయం అందడం లేదు. దీంతో మిగిలిన వాటి కోసం రోగులు అప్పులపాలవుతున్నారు. గుండెజబ్బుల తర్వాత రోగాలతో మరణించేవారిలో క్యాన్సర్‌తో మరణాలే ఎక్కువగా ఉంటున్నట్టు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసర్చ్‌ (ఐసీఎంఆర్‌) ఇటీవల విడుదల చేసిన అధ్యయన ఫలితాల్లో వెల్లడైంది. క్యాన్సర్‌కు సంబంధించిన అవగాహన లేకపోవడంతో ఎక్కువ మందిలో క్యాన్సర్‌ ఉన్నట్టు ఆలస్యంగా బయటపడుతున్నట్టు కూడా ఆ అధ్యయనం గుర్తించింది. దీనిని గుర్తించిన తర్వాత పలువురు రోగులు ప్రభుత్వం ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో చికిత్సకు వెళ్లినప్పటికీ అక్కడ సౌకర్యాలలేమి కారణంగా ప్రయివేటు ఆస్పత్రులకు వెళుతున్నప్పటికీ అక్కడ ఖర్చులను భరించడం వారికి భారంగా మారుతున్నది. మన రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి కూడా రోగులు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో ఇక్కడ సిబ్బంది, సౌకర్యాలు ఏ మాత్రం సరిపోవడం లేదు. నిమ్స్‌తో పాటు ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిని మినహాయిస్తే మిగిలిన ఆస్పత్రులన్ని కార్పొరేట్‌వే కావడం ఆ రోగుల పాలిట శాపంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వస్తే 1990లో ప్రతి లక్షకు 58 మందిగా ఉన్న రోగుల సంఖ్య కాస్తా 76కు పెరిగింది. దేశవ్యాప్తంగా 1990లో 5,48,000 మంది రోగులు పెరిగి 10,69,000కు పైగా పెరగడం క్యాన్సర్‌ తీవ్రతకు అద్దం పడుతున్నది. మన రాష్ట్రంలో ఉదర క్యాన్సర్‌ ఎక్కువగా ఉండగా ఆ తర్వాత వరుసగా బ్రెస్ట్‌, ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్‌కు ఎక్కువగా గురవుతున్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు రోగుల వివరాలను సేకరిస్తుంటాయి. నాన్‌ కమ్యూనికబుల్‌్‌ డిసీజెస్‌ (ఎన్‌సీడీ) రోగుల వివరాలను క్షేత్రస్థాయి నుంచి తెప్పించుకుంటూ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తమ వద్ద అట్టిపెట్టుకుంటాయి. ఇందుకోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బందికి రోగ లక్షణాలపై శిక్షణ ఇచ్చి అలాంటి అనుమానితుల గుర్తింపును చేపడుతున్నాయి. సేకరించిన వివరాల మేరకు ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో మాత్రం రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ సర్కార్‌, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్డియోవాస్క్యులర్‌ వ్యాధులు, క్యాన్సర్‌ నియంత్రణ జాతీయ కార్యక్రమంలో భాగంగా వరంగల్‌లో ఒక ప్రాంతీయ క్యాన్సర్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని, అదే విధంగా మరో చోట అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. దీనికి ఆమోదం లభించడంలో జాప్యం జరుగుతుండడంతో పేదరోగులకు ఇబ్బందికరంగా మారింది.

Related Posts