YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

పాస్ పోర్టులలో కమలం సింబల్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం

పాస్ పోర్టులలో కమలం సింబల్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం

పాస్ పోర్టులలో కమలం సింబల్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ, డిసెంబర్ 13
కొత్త పాస్‌పోర్టులపై కమలం గుర్తు ముద్రిస్తున్నారంటూ వస్తోన్న విమర్శలపై విదేశాంగ శాఖ స్పందించింది. లోక్ సభలో ప్రతిపక్షాలు లేవనెత్తిన అభ్యంతరాలపై కేంద్రం వివరణ ఇచ్చింది. జాతీయ చిహ్నాల్లో ఒకటైన కమలంను కొత్త పాస్‌పోర్టులపై ముద్రించామని విదేశాంగ శాఖ తెలిపింది. భద్రతా చర్యల్లో భాగంగా ఫేక్ పాస్‌పోర్టుల సమస్యను అధిగమించడం కోసం ఈ చర్యలు తీసుకున్నామంది. ముందుగా కమలం గుర్తును ముద్రించామని.. రొటేషన్‌ పద్ధతిలో మిగతా జాతీయ చిహ్నాలను ఉపయోగిస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది.కొత్త పాస్‌పోర్టులపై లోటస్ సింబల్‌ను ముద్రించిన విషయమై కాంగ్రెస్ ఎంపీ ఎంకే రాఘవన్ బుధవారం లోక్ సభ జీరో అవర్‌‌లో అభ్యంతరం లేవనెత్తారు. కేరళలోని కోజికోడ్‌లో అలాంటి పాస్‌పోర్టులను జారీ చేస్తున్నారన్నారు. కమలం గుర్తు బీజేపీ ఎన్నికల గుర్తు కావడంతో ఈ వ్యవహరం వివాదాస్పదమైంది.కాంగ్రెస్ ఎంపీ ఆరోపణల పట్ల విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ గురువారం స్పందించారు. కమలం అనేది మన జాతీయ పుష్పం అని.. ఫేక్ పాస్‌పోర్టులను గుర్తించడం కోసం అదనపు భద్రతా ఫీచర్లలో భాగంగా దాన్ని పాస్‌పోర్టుపై ముద్రించామన్నారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ భద్రతా చర్యలు చేపట్టామన్నారు. ఇప్పుడు కమలం వాడాం.. వచ్చే నెలలో జాతీయ జంతువు లేదా మరో చిహ్నాన్ని వాడుతామన్నారు.

Related Posts