YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అసెంబ్లీని కుదిపేసిన మార్షల్స్ వ్యవహారం

అసెంబ్లీని కుదిపేసిన మార్షల్స్ వ్యవహారం

అసెంబ్లీని కుదిపేసిన మార్షల్స్ వ్యవహారం
విజయవాడ, డిసెంబర్ 13
ఏపీ అసెంబ్లీ ఐదో రోజు వాడీ-వేడిగా మొదలయ్యింది. గురువారం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మార్షల్స్‌తో వాగ్వాదంపై సభలో ప్రస్తావనకు వచ్చింది. టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరు బాధగా ఉందని మంత్రి పేర్ని నాని అన్నారు. అధినేత చంద్రబాబు మెప్పు కోసం తాపత్రయ పడ్డారని, సభ్యులు హుందాగా వ్యవహరించాలన్నారు. కొన్ని ఫోటోలను చూయించి.. మార్షల్స్‌పై అనుచితంగా ప్రవర్తించిన టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.పేర్ని నాని వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కౌంటర్ ఇచ్చారు. కొన్ని ఫోటోలు తీసుకొచ్చి ఎడిట్ చేసి మంత్రి చూపిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుతో చీఫ్ మార్షల్ అనుచితంగా ప్రవర్తించిన ఫోటోలు, వీడియోలు తమ దగ్గర కూడా ఉన్నాయన్నారు. తమను మార్షల్స్ ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలన్నారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించారని.. మార్షల్స్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మంత్రి పేర్ని నాని తనను డ్రామా నాయుడు అనడంపై స్పందించిన ఆయన.. తాను 16 నెలల జైలుకు వెళ్లలేదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.రామనాయుడు వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. జగన్ జైలులో ఉండటానికి కారణాలేంటో ప్రజలకు తెలుసన్నారు నాని. కాంగ్రెస్‌తో విభేదించడం వల్లే జగన్‌పై అక్రమ కేసులు పెట్టారని.. ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారని.. ప్రజలు కూడా 151 సీట్లతో ఘన విజయం అందించారన్నారు. చంద్రబాబులా టీడీపీలోకి పందికొక్కులా దూరి వ్యవస్థను నాశనం చేయలేదన్నారు. బాబు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.టీడీపీ సభ్యులు బుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. చంద్రబాబు రావడానికి ప్రత్యేక గేటు ఉన్నా ఉద్దేశపూర్వకంగా..కావాలని ఎమ్మెల్యేలు వచ్చే గేటు వైపు నుంచి వచ్చారని ఆరోపించారు. మార్షల్స్‌పై దాడి చేసి లోపలకు వచ్చి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటూ ఇతర కార్యకర్తలతో లోపలికి రావాలానుకున్నారని.. అందుకే మార్షల్స్ వారిని అడ్డుకున్నారన్నారు. లోకేష్‌తో పాటూ ఇతర టీడీపీ నేతలు మార్షల్స్‌ను తోసేశారని..
టీడీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అన్నారు.

Related Posts