బ్యాంకులో అగ్ని ప్రమాదం
హైదరాబాద్ డిసెంబర్ 13
అల్వాల్ లోని ఎస్బిఐ బ్యాంకులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది..షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిపారు..ఒక్కసారిగా బ్యాంకు నుండి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు..బ్యాంకులో సరైన ఫైర్ సేఫ్టీ పరికరాలు కూడా లేకపోవడంతో ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉన్నదని వారు తెలిపారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా హుటాహుటిన ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు..అప్పటికే బ్యాంకులో ఉన్న కంప్యూటర్లు దస్త్రాలు దగ్ధమయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరిగి పోయినప్పటికీ ఆస్తినష్టం జరిగినట్లు విలువైన సమాచారం ఉన్నా దస్త్రాలు కంప్యూటర్లు దగ్ధమైనట్లు వారు తెలిపారు. ఫైర్ సిబ్బంది రాకతో మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు. అగ్నిమాపక అధికారి ధనుంజయ మాట్లాడుతూ ఎస్బిఐ బ్యాంకు లో ఉన్న లాకర్లు భద్రంగా ఉన్నట్లు మేనేజర్ తమకు సమాచారం ఇచ్చారని తెలిపారు.అందులో ఉన్న ఫర్నిచర్ కొన్ని కంప్యూటర్లు దస్త్రాలు మాత్రమే దగ్ధమైన ట్లు తెలిపారు. ఈ అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అన్నారు.