YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వ ఉద్యోగిని తిట్టడం దారుణం సభలో సీఎం జగన్ మోహన్

ప్రభుత్వ ఉద్యోగిని తిట్టడం దారుణం సభలో సీఎం జగన్ మోహన్

ప్రభుత్వ ఉద్యోగిని తిట్టడం దారుణం
సభలో సీఎం జగన్ మోహన్
అమరావతి డిసెంబర్ 13
గురువారం  భద్రతా సిబ్బందిపై ప్రతిపక్షనేత చంద్రబాబు  దారుణంగా ప్రవర్తించారు. రోజూ తాను రావాల్సిన గేటులో కాకుండా చంద్రబాబుగారు మరో గేటులో వచ్చారు. గేటు నంబర్ –2 ద్వారా ఆయన రావాల్సి ఉంటుంది. గేటు నంబర్–2 ద్వారా కాకుండా కాలినడకన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు కాని వాళ్లు, పార్టీ కార్యకర్తలు, తన బ్లాక్ క్యాట్ కమాండోలు ఇలా అందరితోపాటు ఒక ఊరేగింపుగా గేట్లలోనుంచి వచ్చారని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మార్షల్స్పై ప్రతిపక్షనేత, ప్రతిపక్ష సభ్యుల దౌర్జన్యంపై సభలో ప్రస్తావన వచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్పందించారు. సీఎం మాట్లాడుతూ సభ్యులను మాత్రమే ప్రవేశపెట్టాల్సిన ఉన్న నేపథ్యంలో మార్షల్స్ ప్రవేశద్వారం వద్ద నియంత్రణలు పెట్టారు. ఆ గేట్లలో నుంచి ఊరేగింపుగా వస్తున్నప్పుడు ఎవరు సభ్యుడు, ఎవరు సభ్యుడు కాదు అని చూసుకుని లోపలికి పంపించేందుకు కొన్ని భద్రతా నిబంధనలు పెట్టారు
ఈ విషయంలో మార్షల్స్ వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తున్నారు. మొత్తం దృశ్యాలన్నీ చూస్తే.. ఎవరు, ఎవరిమీద దౌర్జన్యం చేశారో అర్థం అవుతోందని అన్నారు. చంద్రబాబు నోట్లో నుంచి వచ్చిన మాట ‘‘బాస్టర్డ్’’ అని...ఒక ఉద్యోగిని పట్టుకుని చంద్రబాబు  బాస్టర్డ్ అన్నారు. దీనికి ఆయన సిగ్గుపడాలి
ఒక ప్రభుత్వ ఉద్యోగిని పట్టుకుని బాస్టర్డ్ అని అనడం అంటే ఎంత దారుణమని అన్నారు. లోకేష్ అనే వ్యక్తి నాలుగు అడుగులు ముందుకు వేసి ఏకంగా అధికారులను గొంతుపట్టుకున్నారు. ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఎవరు ఎవరిమీద దౌర్జన్యం చేస్తున్నారని అయన అన్నారు.

Related Posts