రైతుల రాస్తారోకో
కరీంనగర్ డిసెంబర్ 13
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరిలో కరీంనగర్ హుస్నాబాద్ ప్రధాన రహదారి పై బైఠాయించి రైతులు రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తరుగు పేరిట మిల్లర్లు మద్దతు ధరను తగ్గిస్తున్నారని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. పంట వేసినప్పటినుండి కోసే వరకు అనేక వ్యయ ప్రయాసలకోర్చి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువస్తే మిల్లర్ల దోపిడి వల్ల తమ పంటకు పెట్టిన ఖర్చులు కూడా రావడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మిల్లర్లు రైతులను మోసం చేస్తున్న మార్కెట్ అధికారులు మాత్రం చోద్యం చూస్తూ తమకు న్యాయం చేయడం లేదని ఆరోపించారు. రైతులు రాస్తారోకో చేపట్టడంతో కరీంనగర్ హుస్నాబాద్ ప్రధాన రహదారిపై కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులకు నచ్చజెప్పి అధికారులతో మిల్లర్లతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.