YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

 చిత్రకారులకు ఆహ్వానం   - జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి

 చిత్రకారులకు ఆహ్వానం   - జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి

 చిత్రకారులకు ఆహ్వానం  
- జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి
ములుగు, డిసెంబర్ 13
 ఫిబ్రవరి 5 నుండి జరగబోయే ప్రపంచ ప్రసిద్ధి మేడారం జాతర సందర్భంగా, జాతర విశేషాలు ప్రజలకు తెలిపే విధంగా జాతర చుట్టుపక్కల ప్రాంతాల్లో పెయింటింగ్ వేయడానికి కళాకారులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల కళాకారులు ఈ నెల 17న మంగళవారం ఉ. 10.30 గంటలకు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసే సమావేశానికి హాజరు కావాలని ఆయన అన్నారు. పెయింటింగ్ వేసే కళాకారులకు పారితోషికం ఇవ్వనున్నట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Related Posts