రైతుల పేర్లు నమోదు ప్రక్రియ
చిత్తూరు, డిసెంబర్ 13
ఈ నెల 16 నుండి ధాన్యం సేకరణ కు సంబంధించి జిల్లా లో ఏర్పాటు చేసిన 11 కేంద్రాలలో రైతులు వారి పేర్లను నమోదు చేసుకొనే ప్రక్రియను ప్రారంభించాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డి. మార్కండేయులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లోని జెసి సమావేశపు మందిరంలో ధాన్యం సేకరణ పై వ్యవసాయ శాఖ జె డి విజయ్ కుమార్, డి ఎం సివిల్ సప్లైస్ మంజు భార్గవి, డి ఎస్ ఓ విజయరాణి, డి సి ఓ లక్ష్మి, డిఆర్డిఏ పిడి మురళి, మార్కెటింగ్ ఏడి గోపి, ఎఫ్ సి ఐ ప్రొక్యూర్మెంట్ మేనేజర్ శంకరయ్య, డిసిఎంఎస్ రత్నమయ్య ఇతర సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 16 వ తేది నుండి జిల్లా లో ఏర్పాటు చేసిన 11 ధాన్యం సేకరణ కేంద్రాలైన రేణిగుంట, కాపుగన్నెరి, కెవిబి పురం, తంగెల్లపాలెం, నాగలపురం, ఏర్పేడు, వరదయ్యపాలెంలలో గల ప్రాథమిక వ్యవసాయ కమ్యూనిటి సొసైటి నందు, ఎం ఎం ఎస్ తొట్టంబేడు, ఎం ఎం ఎస్ వరదయ్యపాలెం, ఎం ఎం ఎస్ గోవిందవరం, ఎంఎంఎస్ కెవిబి పురంలలో గల వెలుగు కేంద్రాలలో రైతులు వారి పేర్లను నమోదు చేసుకోవలసినదిగా తెలిపారు. ఈ ధాన్య సేకరణ కేంద్రాలలో ధాన్య సేకరణకు అవసరమైన అన్నీ ఏర్పాట్లు సంబంధిత అధికారులు సంబంధిత అధికారులు వెంటనే చేయవలసినదిగా ఆదేశించారు