YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గ్రామాభివృద్ది  ప్రభుత్వ ప్రధాన ధ్యేయం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

గ్రామాభివృద్ది  ప్రభుత్వ ప్రధాన ధ్యేయం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

గ్రామాభివృద్ది  ప్రభుత్వ ప్రధాన ధ్యేయం
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
పెద్దపల్లి డిసెంబర్ 13,
గ్రామాల అభివృద్దే  ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని  రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి  కొప్పుల ఈశ్వర్ అన్నారు . పరేడ్ గ్రౌండ్స్ లో   62 గ్రామపంచాయతిలకు  మొదటి దశ ట్రాక్టర్ల పంపిణీ  కార్యక్రమాన్ని  మంత్రి శుక్రవారం   జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన, జడ్పీ  చైర్మన్,  పెద్దపల్లి ఎమ్మెల్యేతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.  అనంతరం అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ   రాష్ట్రంలోని ప్రతి గ్రామం సంపూర్ణంగా అభివృద్ది  చెందితేనే  మన రాష్ట్రం అభివృద్ది చెందుతుందని మన ముఖ్యమంత్రి బలంగా విశ్వసిస్తారని,  గ్రామాలను బాగు చేయడమే లక్ష్యంగా సీఎం కేసిఆర్ తానే స్వయంగా నూతన పంచాయతి రాజ్ చట్టం రుపొందించి  గ్రామ పంచాయతిలకు విధులు, నిధులు కేటాయించారని మంత్రి తెలిపారు.  ప్రజల భాగస్వామ్యంతో  మార్పు సాధ్యమని గమనించిన  ముఖ్యమంత్రి కేసీఆర్  పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దడం కోసం  30 రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రారంభించారని,  గ్రామాలో ప్రజల నుండి ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చి  విజయవంతమయిందని  మంత్రి అన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా  పంచాయతిలు చెల్లించాల్సిన  రూ.6 వేల కొట్లకు పైగా విద్యుత్ బకాయిలను  ప్రభుత్వం రద్దు చేసిందని, ఇక నుంచి ప్రతి గ్రామపంచాయతి  ప్రతి మాసం  వారి విద్యుత్ బకాయిలు చెల్లించాలని, పెండింగ్ లో ఉంచడానికి వీలు లేదని మంత్రి అన్నారు.  గ్రామ పంచాయతిలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని,    గ్రామ అంతర్గత రోడ్ల పై చెత్త వేసే వారి నుంచి భారీ జరిమానాలు వసూళ్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.     మన పెద్దపల్లి జిల్లాలో 30 రోజుల ప్రత్యేక కార్యచరణ స్పూర్తిని అధికారులు మరియు ప్రజాప్రతినిధులు   సమన్వయంతో పనిచేస్తు నిరంతరం కొనసాగించాలని మంత్రి  ఆదేశించారు.  గ్రామ పంచాయతిలో పారిశుద్ద్యం నిర్వహణ మరియు నాటిన మొక్కలను పూర్తి స్థాయిలో  సంరక్షించుకోవడానికి ప్రతి గ్రామ పంచాయతికి ట్రాక్టర్   అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి అన్నారు.  ప్రభుత్వం అందించే ట్రాక్టర్లను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, గ్రామ పంచాయతిలో మనం నాటిన మొక్కలకు నీరు అందించేందుకు, చెత్త నిర్వహణకు,  గ్రామం పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ట్రాక్టర్లను వినియోగించుకోవాలని, ట్రాక్టర్లతో పాటు అవసరమైన  వాటర్ ట్యాంకర్లు, బ్లేడ్లు సమకుర్చుకోవాలని మంత్రి ఆదేశించారు. పూర్తి పారదర్శకతతో ట్రాక్టర్ల కొనుగొలు ప్రక్రియ ప్రభుత్వ నిబంధనలకు లోబడి  జరిగిందని మంత్రి అన్నారు.  ప్రజలు మన పై విశ్వాసం ఉంచి సర్పంచ్లుగా, ప్రజాప్రతినిధులుగా ఎంపిక చేసుకున్నారని, వారి విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ  పని చేయాలని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటు ప్రభుత్వం పథకాల ఫలాలు వారికి అందించాలని, గ్రామం అభివృద్దికి కృషి చేయాలని మంత్రి సూచించారు. గ్రామంలో పారిశుద్ద్య కార్యక్రమాలు పకడ్భందిగా అమలు చేయాలని, మిషన్ భగీరథ ఫలాలు అందరికి అందేలా  పర్యవెక్షించాలని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం జనవరి మాసంలో మారో మారు 10 రోజుల ప్రత్యేక కార్యచరణ అమలు చేస్తుందని, మన గ్రామాలో నిరంతరం  ప్రజల భాగస్వామ్యంతో స్వచ్చత కార్యక్రమాలను కొనసాగించాలని, పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలని మంత్రి అన్నారు. నిధులను సద్వినియోగం చేసుకోవాలిగ్రామాల అభివృద్ది కోసం ప్రభుత్వం పక్కా ప్రణాళిక రుపొందించి ముందుకు సాగుతుందని జిల్లా జడ్పీ చైర్మన్ పుట్టమధు అన్నారు.   ప్రతి మాసం జనాభా ప్రకారం నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని, సదరు నిధులను సద్వినియోగం చేసుకుంటు నూతన గ్రామ పంచాయతి చట్టం అనుసరించి అభవృద్ది పనులు  పూర్తి చేసుకోవాలని అన్నారు. నూతన గ్రామ పంచాయతి చట్టం పకడ్భందిగా అమలు చేయాలని, ప్రజలను పూర్తి స్థాయిలో భాగస్వామ్యం చేస్తేనే స్వచ్చ గ్రామాలు సాధ్యమవుతాయని ఆయన అన్నారు.30 రోజుల స్పూర్తి నిరంతరం కొనసాగించాలి30 రోజుల ప్రత్యేక కార్యచరణ స్పూర్తిని మన జిల్లాలోని గ్రామాలో నిరంతరం కొనసాగించాలని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు.  ప్రతి వారం ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్వచ్చ శుక్రవారం కార్యక్రమం నిర్వహించి ప్రతి అధికారి గ్రామాలో పర్యటిస్తున్నామని అన్నారు.  ప్రభుత్వం అందిస్తున్న నిధులను , సౌకర్యాలను ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించడానికి సద్వినియోగం చేసుకోవాలని, ప్రస్తుతం పంపిణీ చేస్తున్న  ట్రాక్టర్లతో చెత్త నిర్వహణతో పాటు మనంగ్రామాలో నాటిన మొక్కలను నూరు శాతం సంరక్షించుకోవాలని  కలెక్టర్ అన్నారు.  

Related Posts