YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

రైతు సమన్వయ సమితి చైర్మన్ గా చెర్మన్ గా పల్లా 

రైతు సమన్వయ సమితి చైర్మన్ గా చెర్మన్ గా పల్లా 

రైతు సమన్వయ సమితి చైర్మన్ గా చెర్మన్ గా పల్లా 
హైదరాబాద్ డిసెంబర్ 13, 
రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గా ప్రశాసన్ నగర్ కార్యాలయం లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారుఏ. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు,ఎమ్మెల్సీలు ,ఎమ్మెల్యేలు , పల్లా అభిమానులు హజరయ్యారు.  మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగానికి ధైర్యం వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత రైతుకు గౌరవం వచ్చింది. రాష్ట్రం వచ్చే నాటికి రైతు పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. తెలంగాణ రాకముందు వ్యవసాయం చేస్తున్నామని చెప్పుకోలేని పరిస్థితి నాటి రైతాంగానిది. వ్యవసాయ రంగం ఎంత అభివృద్ధి చెందితే రాష్ట్రం అంత అభివృద్ధి చెందినట్లు. తెలంగాణ రైతు మళ్ళీ సంతోషంగా ఉండే రోజులు రావాలని అన్నారు. కేసీఆర్ రైతుబందు, రైతు భీమా తీసుకు రావడం వల్ల భారతదేశ రైతాంగానికి దైర్యం తెచ్చింది. ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలను కేసీఆర్ ప్రవేశ పెట్టారని అన్నారు.మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ దేశ రైతాంగానికి ఆదర్శంగా నిలిచింది తెలంగాణ రాష్ట్రం. వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంటు ఇచ్చిన ప్రభుత్వం దేశంలో తెలంగాణ ఒక్కటే. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రైతు సమన్వయ సమితిలదే కీలక పాత్రని అన్నారు. రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఏ పని చెప్పినా అర్థం చేసుకుని ముందుకు వెళ్తా. విత్తనాలు, ఎరువులు సక్రమంగా ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలోని కోటి 25 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడం ఖాయం. పంట పెట్టుబడి రైతే రాజుగా తయారు కావడానికి ఉపయోగ పడుతుంది. పంటకు గిట్టుబాటు ధర రావాలంటే మార్కెటింగ్ వ్యవస్థ బాగుండాలి. .పంట గిట్టుబాటు ధర రావడం కోసం గోదాంలు కూడా నిర్మించామని అన్నారు. 

Related Posts