YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 పార్లమెంట్ నిరవధిక వాయిదా

 పార్లమెంట్ నిరవధిక వాయిదా

 పార్లమెంట్ నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ డిసెంబర్ 13, 
పార్లమెంట్ ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. నవంబర్ 18న ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు శుక్రవారంవరకు కొనసాగాయి. 
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ఈ సమావేశాల్లో లోక్సభలో 14 బిల్లులు, రాజ్యసభలో 15 బిల్లులు పాస్ అయినట్లు తెలిపారు. ఇవాళ లోక్సభ ప్రారంభమైన వెంటనే భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా ఎంపీలు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనలు, నిరసనల మధ్యనే 2001లో పార్లమెంట్పై చేసిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరజవాన్లకు స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా సంతాపం తెలిపారు. ఆ తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ బిర్లా ప్రకటించారు. రాజ్యసభ కూడా నిరవధికంగా వాయిదా పడింది.

Related Posts