YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైకాపాలోకి బీదా రాకతో కావలిలో ఖాళీ కానున్న టిడిపి

వైకాపాలోకి బీదా రాకతో కావలిలో ఖాళీ కానున్న టిడిపి

వైకాపాలోకి బీదా రాకతో కావలిలో ఖాళీ కానున్న టిడిపి
 నెల్లూరు డిసెంబర్ 14,
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు బీదా మస్తాన్ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ఆయన వైకాపా లోకి చేరిన రోజు నుండి కావలి నియోజక వర్గంలో ఆయనతోపాటు ప్రయాణం చేసిన అనేక మంది టిడిపి నాయకులు ఆయనలో అనుసరించే పరిస్థితి మొదలైంది. ఈ క్రమంలో గత రెండు మూడు రోజులుగా స్థానిక శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సూచన మేరకు మస్తాన్ రావు ఆయన అనుచరులతో పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. ఆయనకు సన్నిహితంగా ఉంటూ తెలుగుదేశం పార్టీని భుజస్కంధాలపై వేసుకుని నాయకులు ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కావలి నియోజకవర్గం పరిధిలో స్థానిక శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సూచనలు సలహాల మేరకే అక్కడ పలు కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇ ప్రత్యేకంగా మస్తాన్ రావుకు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. శుక్రవారం నెల్లూరు నగరంలో ఉన్న బి ఎం ఆర్ కార్యాలయంలో కావలి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో చర్చా కార్యక్రమాన్ని మస్తాన్ రావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా ప్రతి ఒక్కరు వారి వారి పనులను చెక్క పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పరిస్థితులలో పార్టీలు ఏవైనప్పటికీ తమ అభిమానులను అనుచరులను అనుచరులను కాపాడుకోవాలనే సంకల్పంతో పార్టీ మారవలసి వచ్చిందని, తెలుగుదేశం పార్టీ ఆయనకు ఎటువంటి లోటు చేయలేదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నంత కాలం వ్యాపార రీత్యా తనకు కావాల్సిన మౌలిక వసతులు చంద్రబాబు నాయుడు కల్పించాలని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నేటికీ నాటికి తెలిసి పార్టీ నాయకులు తోనూ అది ఎటువంటి విమర్శాత్మక భేదాభిప్రాయాలు లేవు అన్నారు. రానున్న రాజకీయ పరిణామాలను ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ ఐక్యత గా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి వైకాపా రాష్ట్రంలో ప్రత్యేక పార్టీగా ఉండబోతుందని అటువంటి పార్టీని అధినేతను నమ్ముకోవడం ఇటువంటి ఇబ్బందికర పరిస్థితి లేదన్నారు. ఇప్పటివరకు రాజకీయంగానూ వ్యాపారం గానూ తనతో పాటు ప్రయాణించిన రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు తనతో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లైతే హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని తెలియజేశారు. పార్టీలోకి రావాలని ప్రత్యేకంగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదన్నారు. ఏది ఏమైనా కావలి నియోజకవర్గం లో బీదా మస్తాన్ రావు లేని లోటు తెలుగుదేశం పార్టీకి కనిపించబోతోంది అని స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

Related Posts