ఈ- వేస్ట్ తో నిండిపోతున్న హైద్రాబాద్
హైద్రాబాద్, డిసెంబర్ 14,
సిటీలో ఎలక్ట్రా నిక్ వేస్టేజ్ (ఈ–వేస్టేజ్ ) విపరీతంగా పెరిగింది . గ్రేటర్ లో ఏటా సుమారు 40వేల టన్నులకు పైగా ఈ–వ్యర్థాలు వస్తున్నాయి. ప్రతిఇంట్లో ఏడాదికి సగటున సుమారు 6 నుంచి 7కిలోలు పడేస్తున్నట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (పీసీ బీ), ఎన్విరా న్ మెంట్ ప్రొటెటెక్షన్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఈపీటీఆర్ ఐ ) చేసిన సర్వేలో గుర్తించారు. దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో 97వేల టన్నులతో ముంబయి, మొదటి స్థానంలో ఉండగా, 67 వేల టన్నులతోఢిల్లీ రెండో స్థానంలో ఉంది. 57వేల టన్నుల ఈ–వేస్ట్తో బెంగళూరు మూడోస్థానం, 47వేల టన్నులతో చెన్నై నాలుగో స్థానంలో ఉన్నాయి. 40వేల టన్నుల తో హైదరాబాద్ అయిదో స్థానంలో ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది . సెల్ఫోన్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు ఇతర పరికరాలు ఏడాదికి 13 వేల వ్యర్థాలు పడేస్తున్నారు. వాహనాల విడిభాగాలు, రిఫ్రిజరేటర్స్ , కూలర్లు, ఏసీల వంటివి సుమారు27వేల టన్నుల వరకు పడేస్తున్నట్ టు పీసీబీ అధికారులు గుర్తించారు.గ్రేటర్ లో 2010లో సుమారు 2800 టన్నులు ఈ వ్యర్థాలు ఉంటే.. 2017 నాటికి 32 వేల టన్నులకు చేరింది . అప్పట్లోనే పెరిగి న ఈ–వ్యర్థా లు
పర్యావరణానికి ప్రమాదమని నిపుణులు హెచ్చరించారు. 2019లో పరిశీలస్తే సుమారు 40 వేల టన్నులకు పైగా ఈ–వ్యర్థా లు పడేస్తున్నట్ టుతేలింది . నిత్యం ఇళ్ల నుం చి పడేస్తున్న వాటిలోనే ఈ–వేస్టేజ్ ఎక్కువగా ఉంటున్నట్టు అధికారులు పేర్కొంటున్నరు. మరో రెం డేళ్లలో50 వేల టన్నులకు చేరే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2010లో ముంబయిలో ఏడాదికి సగటున 11వేల టన్నుల ఈ–వేస్టేజ్ వస్తున్నట్టు అధికారులు తెలిపా రు. ఢిల్లీలో 10వేల టన్నులు, బెం గళూరు 5వేల టన్నులు, చెన్నై4500 టన్నులు,
ఈ– వ్యర్థా లు వచ్చినట్టు పేర్కొన్నారు. ఈ–వ్యర్థాల శుద్ధికి క్లీన్ ఈ –ఇన్షియేటివ్ అనే పథకాన్ని ప్రారంభించారు. గ్రేటర్ పరిధిలో ఖైరతాబాద్ ,హఫీజ్ పేట్ , జూబ్లీహిల్స్, సికిం ద్రాబాద్ , కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో 9 కేం ద్రాలున్నాయి. వీటినిర్వహణ సక్రమంగా లేక ఈ–వ్యర్థా లు రీసైక్లింగ్ కావడం లేదు. మరోవైపు సాధారణ చెత్తతో పాటే చాలామంది ఎలక్ట్రా నిక్ వ్యర్థా లను ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు.టీవీల్లో ఉపయోగిం చే ఈ–ట్యూబ్ లో లెడ్, బేరియం ఉండటం వలన భూగర్భ జలాలు కలుషితం అవుతాయి. ప్రింటర్లు, కీ బోర్డుల్లో ఉండే హైడ్రో కార్భన్లు భూమి, నీటిని విషతుల్యం చేస్తాయి. వివిధ ఎలక్ట్రా నిక్ వ్యర్థాల్లో ఉండే హైడ్రోకార్భన్లు, బ్రోమిన్ , బెరి లీయం, క్యాడ్మియం, మెర్క్యూరీ వంటి పదార్థా లు భూగర్భ జలాల్లోకి వెళ్లి విషతుల్యం చేస్తాయి. కంప్యూటర్లలో ఉండే క్యాథోడ్ రే, ఎల్సీ డీ, క్యాడ్మియం వంటివి రక-్తప్రసరణ వ్యవస్థని దెబ్బతీసి, మూత్రపిండాలకు హానీ కల్గిస్తాయని నిపుణులు హెచ్చరి స్తున్నారు. ఈ వస్తువుల్లో ఉండే మూలకారకాల వలన గుండెనాడీ, కిడ్నీ గ్రంథులు, రక్తప్రసరణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. క్యాడ్మియం వలన గాలి విషతుల్యమవడంతో పీల్చిన వారికి శ్వాసకోశ సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.