YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

లోక్ ఆధాలత్ లో కేసులు పరిష్కారమే అంతిమతీర్పు అవుతుంది

లోక్ ఆధాలత్ లో కేసులు పరిష్కారమే అంతిమతీర్పు అవుతుంది

లోక్ ఆధాలత్ లో కేసులు పరిష్కారమే అంతిమతీర్పు అవుతుంది
- న్యాయమూర్తి వీర్రాజు 
కోప తాపాలు వైషమ్యాలతో ప్రశాంత జీవనం కు ఇబ్బందులు 
– న్యాయమూర్తి రామగోపాల్ 
తిరుపతి, డిసెంబర్ 14 
దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్ ఆధాలత్ కేసుల పరిష్కారంలో భాగంగా నేడు తిరుపతి న్యాస్థానంలో నిర్వహిస్తున్నామని ఇక్కడ పరిష్కరించుకున్న కేసులు అంతిమతీర్పు అవుతుందని పై కోర్టులకు వెళ్ళే అవకాశం వుండదని, ఇరుపక్షాలు రాజీతో  గెలుపు సాధించనవారవుతారని మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి మరియు మండల న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్ గౌ.న్యాయమూర్తి  వీర్రాజు అన్నారు. శనివారం ఉదయం తిరుపతి న్యాయస్థాన ఆవరణలో నాలుగు బెంచ్ లలో లోక్ ఆధాలత్ నిర్వహణలో భాగంగగా హాజరయిన కక్షిదారులు, న్యాయవాదులు, పోలీస్ , ప్రభుత్వ శాఖలు , ప్రవేటు రంగ సంస్థల ప్రతినిధులతో తిరుపతి న్యాయస్థాన న్యాయమూర్తులు , బార్ అషోషియన్ వారు సమావేశమై ప్రసంగించారు. మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి మరియు మండల న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్ మాట్లాడుతూ కక్షి దారులు సామరస్యంగా పరిష్కరించుకునేందుకు మంచిఅవకాశం లోక్ ఆధాలత్ అని అన్నారు. ఇందులో క్రిమినల్ కాంపౌడబుల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటార్ ప్రమాదాల పరిహారకేసులు సివిల్ , బ్యాంకు, చిట్ ఫండ్ వంటి కేసులు ఇరుపార్టీల అంగీకారంతో పరిష్కరించుకొంటే ఇదివరకు చెల్లించిన కోర్టు ఫీసులు వాపసు, అంతిమతీర్పు అవుతుందని తెలిపారు. గత మాసం నవంబర్ లో 236 కేసులు పరిష్కరించామని , నేడు ఇంకా ఎక్కువ జరగాలని ఆశిస్తున్నామని అన్నారు. సహకారం అందిస్తున్న ప్రభుత్వ శాఖలకు, ప్రవేటు సంస్థలకు , కాక్షిదారులకు,న్యాయవాదులకు ధన్యవాదాలని అన్నారు. నాల్గవ  అదనపు జిల్లా న్యాయమూర్తి గౌ. రామ్ గోపాల్ మాట్లాడుతూ కోపతాపాలు సహజమని వైశామ్యాలతో శాంతి, ప్రశాంతి జీవనంకు భంగం కలగకుండా చూడాలని అన్నారు. కేవలం కోపతాపాలతో కుటుంబం విడిపోవడం అందువల్ల గ్రామాల్లో వర్గాలు ఏర్పడటం జరుతున్నాయని వాటికి మనం స్వస్థి పలికి ప్రశాంత జీవనం సాగించాల్సిన అవసరం వుండనియా అన్నారు. ఆంద్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ కేసుల పరిష్కారానికి రాత్రి 8, 9 వరకు కోర్టు నడుపుతున్నారని మేము ఆదర్శంగా తీసుకుని పనిచేయనున్నామని ఇవన్నీ సమాజంలో ప్రశాంతత కోసమే నాని గుర్తించాలని అన్నారు. ఆవరణలో మొదటి కేసును సతీష్ కు యునైటెడ్ ఇన్సూరెన్స్ పరిహారం రూ.3.80 లక్షలు ఇచ్చేవిధంగా పరిష్కరించారు. సతీష్ కు 2016 లో  రేణుగుంట బైపాస్ లో వాహన ప్రమాదం జరుగగా రూ.7 లక్షలకు  క్లైము కు గాను ఇరుపార్టీల అంగీకారంతో పై పరిహారం న్యాయమూర్తులు అందిచారు. ఈ సమావేశంలో బార్ న్యాయమూర్తులు అన్వర్ బాషా, రామచంద్రుడు , శిరీష్, శివప్రసాద్, శోభారాణి , బార్ అధ్యక్షులు నరహరి రెడ్డి పాల్గొన్నారు.

Related Posts