YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

 దిశ లివర్ లో మద్యం

 దిశ లివర్ లో మద్యం

 దిశ లివర్ లో మద్యం
హైద్రాబాద్, డిసెంబర్ 14  
దిశ హత్య కేసులో రాన్రానూ కొత్త విషయాలు బయటికొస్తున్నాయి. తాజాగా దిశ లివర్‌లో మద్యం ఉన్నట్లు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. అత్యాచారం సమయంలో నిందితులు దిశ నోట్లో బలవంతంగా మద్యం పోశారని పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా లివర్‌లో మద్యం ఆనవాళ్లు కనిపించడంతో దిశకు బలవంతంగా మద్యం తాగించారనేందుకు బలం చేకూర్చినట్లయింది. అంతేకాకుండా ఈ కేసులో పోలీసులకు మరో ఆధారం కూడా బలంగా మారింది. అత్యాచార ఘటనకు సమీపంలో ఉన్న రన్‌వే 44 వైన్స్ అనే పేరు గల మద్యం దుకాణంలో నిందితులు మద్యం సీసాలను కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. అయితే, ఈ దృశ్యాలను పోలీసులు బయటకు విడుదల చేయలేదు.దిశ నోట్లో మద్యం పోసినట్లు నిందితులు నేర అంగీకార వాంగ్మూలంలోనూ ఈ విషయం వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు రిమాండ్‌ డైరీలో పోలీసులు పేర్కొన్నారు. తాజాగా ఇదే విషయాన్ని ఫోరెన్సిక్‌ నిపుణులు నిర్ధరించారు. దీన్ని బట్టి నిందితులు ఆమెతో బలవంతంగా మద్యం తాగించారనే విషయం ధ్రువపడుతోంది. మరోవైపు దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ మృతదేహాలు గాంధీ ఆస్పత్రి మార్చురీలోనే ఉన్నాయి. ఈ ఎన్‌కౌంటర్ వ్యవహారంలో జ్యుడీషియల్ ఎంక్వైరీ కోసం సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిషన్ జోక్యం చేసుకొనే వరకూ శవాలను జాగ్రత్తగా ఉంచాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. నిందితుల మృతదేహాల అప్పగింత అంశంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ కేసులో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించింది.హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌ సమీపంలోని తొండుపల్లి సర్వీస్‌ రోడ్డులోని చటాన్‌పల్లి వద్ద ‘దిశ’ అనే వెటర్నరీ డాక్టర్‌పై నలుగురు కామాంధులు అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాక, యువతిని బతికి ఉండగానే సజీవ దహనం చేశారు. దీనిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు పెల్లుబికాయి. నలుగురు నిందితులను తక్షణం చంపేయాలని నిరసనలు హోరెత్తాయి. తర్వాత కొన్ని రోజులకు కస్టడీలో ఉన్న నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా, పోలీసులు నలుగురినీ ఎన్‌కౌంటర్ చేశారు.

Related Posts