46 ఏళ్ల తర్వాత ఎడిటర్ పోస్టులో మరో పేరు
హైద్రాబాద్, డిసెంబర్ 14
ఈనాడు పత్రికలో ప్రధాన బాధ్యత నుంచి రామోజీరావు తప్పుకున్నారు. అదేంటి.. పత్రిక యజమానే రామోజీరావు కదా అని ఆశ్చర్యపోతున్నారా! కేవలం పత్రిక చీఫ్ ఎడిటర్ బాధ్యతల నుంచి మాత్రమే ఆయన వైదొలిగారు. శనివారం ( రోజు వెలువడ్డ పత్రికలో ఈ మార్పు కనిపించింది. శుక్రవారం కూడా ఎడిటర్ స్థానంలో రామోజీరావు పేరే ఉంది. శనివారం నాటి పత్రిక ఇంప్రింట్ లైన్‌లో (ఆఖరి పేజీలో అడుగుభాగంలో ఉంటుంది) ఎడిటర్ స్థానంలో మరో పేరు ఉంది. అయితే, తెలంగాణ ఎడిషన్‌కు ఒకరి పేరు, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్‌కు మరొకరి పేరు ఉండడం విశేషం. ఫౌండర్‌గా రామోజీరావు పేరు ఉంది.తెలంగాణ, హైదరాబాద్ ఎడిషన్లకు ఎడిటర్‌గా డీఎన్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్‌కు ఎడిటర్‌గా ఎం.నాగేశ్వరరావు పేర్లు ఉన్నాయి. వీరిద్దరూ ఈనాడు సంస్థలో చాలా సీనియర్లు. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్‌కు ఎడిటర్‌గా ఉన్న ఎం.నాగేశ్వరరావు ఈనాడు జర్నలిజం స్కూలుకు ప్రిన్సిపల్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తుండడం సహా, ఈటీవీ న్యూస్ ఛానెళ్లలో ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ తెలంగాణ ఎడిటర్ డీఎన్ ప్రసాద్ గుర్తింపు పొందారు. ఈయన పలు సందర్భాల్లో వివిధ అంశాలపై చర్చా వేదికలు నిర్వహిస్తుంటారు.1974లో ఈనాడు స్థాపించిన తొలి రోజు నుంచి చీఫ్ ఎడిటర్‌గా రామోజీరావు కొనసాగుతున్నారు. తాజా పరిణామంతో 46 ఏళ్ల ఈనాడు పత్రిక చరిత్రలో తొలిసారి చీఫ్ ఎడిటర్ స్థానంలో మరొకరి పేరు కనిపించింది. మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆయన పెద్ద కుమారుడు సీహెచ్. కిరణ్ వ్యవహరిస్తున్నారు