YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

స్టీల్ ప్లాంట్ కి భూమి అప్పగించండి..జగన్ సర్కార్ కీలక ఆదేశం !

స్టీల్ ప్లాంట్ కి భూమి అప్పగించండి..జగన్ సర్కార్ కీలక ఆదేశం !

స్టీల్ ప్లాంట్ కి భూమి అప్పగించండి..
         జగన్ సర్కార్ కీలక ఆదేశం !
అమరావతి డిసెంబర్ 14   
తాజాగా వైఎస్సార్ కడప జిల్లా లో ఏర్పాటు చేయబోయే స్టీల్ ప్లాంట్ పై కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్కు 3148.68 ఎకరాల భూమిని ముందస్తుగా అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైఎస్సార్ కలెక్టర్కు అనుమతిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం పెద్దండ్లూరు సున్నపురాళ్లపల్లి గ్రామాల పరిధిలో 3148.68 ఎకరాలను జీవో–571 ప్రకారం ఎకరా రూ.1.65 లక్షల ధరతో కేటాయించాలని ప్రభుత్వం ఇప్పటి కే నిర్ణయం తీసుకుంది.స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అవసరమయ్యే  భూమిని ఏపీ హైగ్రేడ్ స్టీల్స్కు ముందస్తుగా అప్పగించాలని గత నెల 27న మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. ఇందులో భాగంగానే తక్షణమే ఏపీ హైగ్రేడ్ స్టీల్స్కు భూమిని అప్పగించాలని  జిల్లా కలెక్టర్ను రెవెన్యూ శాఖ కార్యదర్శి వి.ఉషారాణి ఆదేశించారు. ఈ నెలలోనే వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రెవెన్యూ శాఖ ఈ ఆదేశాలు జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ స్టీల్ ప్లాంట్  ద్వారా దాదాపుగా 10 వేలకి పైగా ఉద్యోగాలు కల్పించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వం అధికారం చే పట్టిన తరువాత సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీని అభివృద్ధి లో పరుగులు పెట్టిస్తున్నారు. రాజన్న రాజ్య స్థాపనే తన లక్ష్యం అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ఆ రాజన్న బిడ్డగా ..తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకుంటూ ప్రజల కోసం ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ పాలన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలతో పాటుగా ఇవ్వని హామీలని సైతం అమలు చేస్తూ ప్రజా నాయకుడి గా పేరు తెచ్చుకున్నారు.

Related Posts