YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 పార్టీల మార్పు తప్పదు  : వరప్రసాద్

 పార్టీల మార్పు తప్పదు  : వరప్రసాద్

 పార్టీల మార్పు తప్పదు  : వరప్రసాద్
విజయవాడ, డిసెంబర్  14, 
జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వ్యవహారం అయోమయంలో ఉంది. ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చారంటూ సోషల్ మీడియాలో ప్రచారంతో కలకలంరేగిన సంగతి తెలిసిందే. ఈ గందరగోళానికి పుల్‌స్టాప్ పెడుతూ పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు.. ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వలేదని.. అదంతా తప్పుడు ప్రచారమని క్లారిటీ ఇచ్చారు. దీంతో రాపాక ఎపిసోడ్‌కు పుల్‌స్టాప్‌ పడిపోయిందని అందరూ భావించారు. పార్టీ మారడం అనేది సర్వ సాధారణమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీలో కొన్ని మార్పులు జరగాలని.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోకుంటే పార్టీ ముందుకెళ్లదన్నారు. ప్రజల కోసం పనిచేయాలని.. తన భవిష్యత్ కోసం కూడా తాను ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీతో తనకు సంబంధాలు ఉన్నాయనడం అవాస్తవమని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అసెంబ్లీలో మైక్ దొరకదన్నారు.జనసేన నుంచి నాకు షోకాజ్ నోటీసులు రాలేదని క్లారిటీ ఇచ్చారు.రాపాక తాజాగా పార్టీలో మార్పులు జరగాలని వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు పార్టీతో కొంత గ్యాప్ ఉన్నట్లు రెండు రోజుల క్రితం ఆయనే స్వయంగా చెప్పారు. మరి వరప్రసాదరావు వ్యాఖ్యలపై అధినేత పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారన్నది చూడాలి. ఈ గందరగోళం కొనసాగుతుండగానే.. జనసేనలో కీలక నేతగా ఉన్న రాజు రవితేజ పార్టీకి రాజీనామా చేయడం హాట్‌టాపిక్ అయ్యింది

Related Posts