YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కృష్ణకిషోర్ కు బిగిస్తున్న ఉచ్చు

కృష్ణకిషోర్ కు బిగిస్తున్న ఉచ్చు

కృష్ణకిషోర్ కు బిగిస్తున్న ఉచ్చు
విజయవాడ, డిసెంబర్ 16 :
ఏపీ ఐఆర్‌ఎస్ కృష్ణ కిషోర్‌పై కేసు నమోదైంది.. సెక్షన్ 188,403, 409, 120 బీ కింద సీఐడీ కేసు ఫైల్ చేసింది. ఇటీవలే జాస్తి కృష్ణ కిషోర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కృష్ణ కిషోర్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో.. పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ నుంచి ప్రభుత్వం నివేదిక తెప్పించుకుంది. అనంతరం కృష్ణ కిషోర్‌పై కేసు నమోదు చేయాలని సీఐడీ, ఏసీబీని ఆదేశించింది.. ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని సూచించింది. విచారణ పూర్తయ్యేవరకు అమరావతి విడిచి వెళ్లకూడదని కృష్ణ కిషోర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.కృష్ణ కిషోర్‌ టీడీపీ ప్రభుత్వం హయాంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పని చేశారు. ఏపీ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఏపీఈడీబీ)కు సీఎం చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మూడేళ్ల పదవీ కాలానికి గతంలో చంద్రబాబు ఆయన్ను ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా నియమించారు. 1990 బ్యాచ్‌కు చెందిన కృష్ణ కిశోర్.. అంతకు ముందు పౌర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు వద్ద సెక్రటరీగా పని చేశారు. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన కృష్ణ కిశోర్.. ఐఆర్ఎస్ కావడానికి ముందు హైదరాబాద్‌లోని ఓ సంస్థలో పని చేశారు.కృష్ణ కిషోర్‌ పై అవినీతి ఆరోపణలు రావడంతో సస్పెండ్‌ చేస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది. అవినీతి ఆరోపణలో శ్రీనివాస్ రెడ్డి అనే మరో అధికారిని కూడా జగన్ సర్కారు సస్పెండ్ చేసింది. ఇటు సచివాలయంలో సస్పెండ్ అయిన ఇద్దరు సాధారణ పరిపాలన శాఖ అధికారులకు జగన్ సర్కారు తిరిగి పోస్టింగ్ ఇచ్చింది. జీఏడీ అసిస్టెంట్ సెక్రటరీ జయరాం, సెక్షన్ ఆఫీసర్ అచ్చయ్యలకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఐఆర్ఎస్ అధికారి వెంకయ్య చౌదరి బదిలీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై ప్రభుత్వం వీరిని సస్పెండ్ చేసింది. పని ఒత్తిడి వల్ల తప్పు జరిగిందని భవిష్యత్తులో పొరపాటు జరగకుండా జాగ్రత్తపడతామని వీరిద్దరూ ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు.

Related Posts