YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం దేశీయం

 ప్రశాంత్ కిషోర్ కు ముందుంది...

 ప్రశాంత్ కిషోర్ కు ముందుంది...

 ప్రశాంత్ కిషోర్ కు ముందుంది...
పాట్నా, డిసెంబర్ 16:
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు రోజు రోజుకూ డిమాండ్ పెరుగుతోంది. జనతాదళ్ యు ఉపాధ్యక్ష పదవిలో ఉన్న ప్రశాంత్ కిషోర్ బీజేపీ వ్యతిరేక పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. త్వరలో బీహార్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఇప్పటికే జేడీయూ, బీజేపీల మధ్య ఒప్పందం కుదిరింది. రెండు పార్టీలు కలసి బీహార్ ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. అయితే జేడీయూ ఉపాధ్యక్ష పదవిలో ఉన్న ప్రశాంత్ కిషోర్ ఇతర రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ వ్యతిరేక పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు.ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీకి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ బృందం పశ్చిమ బెంగాల్ లో పని ప్రారంభించింది. దీదీకి అండగా నిలిచింది. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ శివసేనకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించకపోయినప్పటికీ ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే రాజకీయ అరంగేట్రానికి సహాయ సహకారాలు అందించారు. ఆదిత్య థాక్రే పాదయాత్ర ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సూచనమేరకే జరిగింది.ఇక దక్షిణాది రాష్ట్రాల్లోని తమిళనాడులో ఎన్నికలకు మరో రెండేళ్లు ఎన్నికల సమయం ఉన్నప్పటికీ అక్కడ కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకుంటామని చెప్పింది. దీంతో పాటు త్వరలో కొత్త పార్టీ పెట్టబోయే రజనీకాంత్ కూడా ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి. డీఎంకే అధినేత స్టాలిన్ సయితం ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించనున్నట్లు ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. త్వరలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిలకు జరగనున్నాయి. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి మధ్యనే పోటీ ఉన్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తుండటంతో వచ్చే ఏడాది ప్రశాంత్ కిషోర్ సత్తా తేలిపోనుంది. ఏపీలో వైసీపీ విజయం సాధించడంతో ప్రశాంత్ కిషోర్ వెంట అన్ని రాజకీయ పార్టీలు వెంటపడుతున్నాయి. బీహార్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మమత, అరవింద్ కేజ్రీవాల్ నెగ్గితే ప్రశాంత్ కిషోర్ పేరు మరోమారు దేశ రాజకీయాల్లో మారుమోగనుంది. ఈ రెండు ఎన్నికల్లో తేడా కొడితే పీకేను పట్టించుకునే వారుండరన్నది వాస్తవం.

Related Posts