తాగుబోతుల కు అడ్డాగా మారిన శివకేశవ ఆలయ ప్రాంగణాలు
వనపర్తి డిసెంబర్ 16
మండల కేంద్రమైన గోపాల్ పేట లోని శివ కేశవ ఆలయ ప్రాంగణాలు తాగుబోతులకు నిలయంగా మారిన కూడా ఎవరూ పట్టించుకోక పోవడంపై ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వెలిబుచ తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో బ్రాహ్మణులు నివాస ఉండడమే కాకుండా ప్రస్తుతం అయ్యప్ప స్వాములు ఉండి ఆ ప్రాంతమంతా అయ్యప్ప నామస్మరణతో పులకరించిపోతుంది. ఒకపక్క బ్రాహ్మణుల నివాసం మరోపక్క అయ్యప్ప నామస్మరణతో పులకరించిపోతున్నఈ స్థలంలో తాగుబోతులకు నిలయంగా మారడం వల్ల ఆ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు .ముఖ్యంగా గ్రామంలో అధికంగా బెల్టుషాపులు ఉండడంవల్ల ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందోనని వారితో పాటు ప్రజలు తీవ్ర ఆందోళన పడుతున్నారు. బస్టాండ్ సమీపంలో సాకలి పల్లి రోడ్డు వెళ్లేదారిలో మద్యం షాపు ఉన్న కూడా గ్రామంలో అడుగడుగునా బెల్టుషాపులు ఉండడంవల్ల తాగుబోతు రెచ్చి పోయి మద్యం సేవిస్తూ కాళీ సీసాలను వీధివీధిలో పడేయడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితులు నెలకొని నెలలు గడుస్తున్నా కూడా ఏ ఒక్కరూ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం పై ప్రజలు ఆగ్రహావేశాలు వెలిబుచ్చుతూ ముఖ్యంగా సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై వారు అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామంలో రోజురోజుకు బెల్టుషాపులు పెరిగిపోతూ తాగుబోతులు విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ బ్రాహ్మణుడు ఉండే ప్రదేశాలను కలిసిత ప్రదేశాలుగా మారుస్తూ వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీని దృష్ట్యా ఇప్పటికైనా సంబంధిత అధికారులు గానీ పోలీసులు గాని తక్షణమే చర్యలు తీసుకొని పవిత్ర స్థలాలను అపవిత్రం కాకుండా చూడాలని బ్రాహ్మణులు కోరుతున్నారు.