చంద్రబాబు పాలసీ మద్యం తాగు, తాగించు
అమరావతి డిసెంబర్ 16
మద్య నిషేధం, మద్యం అమ్మకాలు, షాపుల అద్దెల పై ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్, వాణిజ్య పన్నులశాఖ మంత్రి కె నారాయణస్వామి సోమవరం ఉదయం శాసనసభలో వివరణ ఇచ్చారు. మద్యపాన నిషేధంపై మాట్లాడే నైతిక హక్కు (టిడిపి) వారికి లేదు. ఎన్టీరామారావు పూర్తిగా మద్యపాన నిషేధం అమలు చేస్తే చంద్రబాబు దాన్ని ఎత్తేశారు. చంద్రబాబు పాలసీ మద్యం తాగు, తాగించు అని వ్యాఖ్యానించారు. మద్యపానాన్ని నిషేధించాలన్న ముఖ్యమంత్రి లక్ష్యానికి అనుగుణంగా , వైయస్సార్ పార్టీ వాళ్లు టెండర్లు వేయలేదు. టెండర్లలో 80 శాతం టిడిపి వాళ్లవే.
ఈ మూడు నెలల్లో మద్యం వినియోగం తగ్గింది. ఏఫ్రెల్లో 48.33 శాతం తగ్గింది. ఇది క్రమేపీ తగ్గుతూ ఆగçష్టులో మైనస్ 2.5 శాతం తగ్గింది. అచ్చన్నాయుడు కి సూటిగా ఒక ప్రశ్న.... మద్యాపాన నిషేధాన్ని అమలు చేయాల్నా వద్దా అని అన్నారు. మద్యపానాన్ని దశలవారీగా తగ్గించాలన్న లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చిన తర్వాత 20శాతం షాపులు తగ్గించారు.
గతంలో 4380 షాపులు ఉండగా... దాన్ని 20శాతం తగ్గిస్తూ 3500 షాపులకు కుదించారు. షాపులు రెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇది నామినేషన్ పై ఇచ్చినది కాదు. ఒక ఐఏఎస్ ఆధికారిని, జాయింట్ కలెక్టర్ని అధ్యక్షత వహించమన్నారు. ప్రభుత్వానికి సంబం«ధించిన ఆరుగురు ఉద్యోగులను ఆ కమిటీలో వేశారు. టెండరు రూపంలో రూంలు అద్దెకు తీసుకున్నారు. ఏపిఎస్బిసిఎల్ ద్వారా అమ్మకాలు చేపడుతున్నాం. మద్యపానాన్ని నిషేధించాలన్న ముఖ్యమంత్రిగారి లక్ష్యానికి అనుగుణంగా , ఒక సంకల్పంతో దీన్ని ముందుకు తీసుకురావాలని మా వైయస్సార్ పార్టీ వాళ్లుఎవరూ కూడా టెండర్లు ఏసేదానికి ముందుకు రాలేదని అయన అన్నారు. దాదాపు 80 శాతం తెలుగుదేశం వాళ్లే టెండర్లు వేశారు. విశాఖపట్నంలో టిడిపి మద్ధతుదారులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన షాపులు అద్దెకు తీసుకున్న వారు, విశాఖపట్నంలో జనప్రియ గ్రూప్, కే వి ఆర్ ప్రసాద్ టిడిపి మద్ధతుదారుడు. వారి ద్వారానే కేటాయించడమైంది. చంద్రబాబు అయినా, వారి కుమారుడు లోకేష్ అయినా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకుంటే మద్యం విక్రయానికి లాటరీ సిస్ధంలో మీక్కూడా షాపులు ఇస్తారని చెప్పాను.. దీనికి నేను 80 శాతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకి ఇస్తానన్నాననికోర్టుకు కూడా నా పై వేశారని అన్నారు. వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ముందుకు రావడం లేదు. మొత్తం మీరే అమ్ముతున్నారు. అదే మా ఖర్మ. షాపుల నిర్వహణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే దుస్ధితి పట్టలేదని అయన అన్నారు.