అనంతపురం-అమరావతి హైవేకు వంద కోట్లు
అయరావతి డిసెంబర్ 16
అనంతపురం-అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే పై రాష్ట్ర ఆర్అండ్ బి శాఖామంత్రి ధర్మాన కృష్ణదాస్ శాసనమండలిలో వివరణ ఇచ్చారు. అనంతపురం-అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే కోసం రూ.100 కోట్లు కేటాయించాం. అవసరమైన మేరకు ఇంకా నిధులు కేటాయించేందుకు సిద్దం. దీనిని అత్యంత ముఖ్యమైన హైవేగా ప్రభుత్వం భావిస్తోంది. - ఈ హైవే కోసం 4993 హెక్టార్ల భూమిని సేకరించాల్సి వుంది. దీనిలో ఇప్పటికే 4839 హెక్టార్ల సేకరణకు 3ఎ నోటిఫికేషన్ ఇచ్చాం. అటవీశాఖ నుంచి కూడా అనుమతులు తీసుకుంటున్నాం. ట్రాఫిక్ అవసరాలను బట్టి హైవే ఎన్ని లైన్లతో వుండాలనేది పరిగణలోకి తీసుకుంటున్నామని అన్నారు.