ఉన్నావ్ రేప్ కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు ఎమ్మెల్యే కుల్దీప్ సింగే దోషి..
దేశవ్యాప్తంగా సంచలన రేపిన ఉన్నావ్ రేప్ కేసులో ఢిల్లీ తీస్ హజారీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రెండేళ్ల కింద మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసులో బీజేపీ బహిష్కృత నేత, ఎమ్మెల్యే కుల్దీప్ సెనెగర్‌ను కోర్టు దోషిగా తేల్చింది. బాధితురాలిని కిడ్నాప్ చేసి పలుమార్లు అత్యాచారం చేసినట్లు నిర్ధారించింది. రేపు ఆయనకు శిక్ష ఖరారు చేయనుంది ఢిల్లీ కోర్టు. ఈ కేసులో జడ్జి ధర్మేష్ జడ్జి 2017లో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ఓ బాలికను కిడ్నాప్ చేయించినట్లు ఆరోపణలొచ్చాయి. మరో నిందితుడు శశిసింగ్ ఈ కిడ్నాప్ చేసినట్లు అభియోగాలున్నాయి. 2019 ఆగస్టు 9న ఎమ్మెల్యేపై కూడా అభియోగాలు నమోదవ్వడంతో బీజేపీ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. నేరపూరిత కుట్ర, కిడ్నాప్, పెళ్లికి బలవంత పెట్టడం, రేప్ సెక్షన్లతోపాటూ... పోక్సో కింద కూడా ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి. ఇక అభియోగాల నమోదుకు పది రోజుల ముందు ఓ యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలో బాధితురాలు తీవ్రంగా గాయపడగా... బాధితురాలి బంధువులు మరణించారు. బాధితురాలి తండ్రిపై యూపీలో ఓ హత్య కేసు, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారనే మరో కేసు నమోదయ్యాయి. ఆయన్ను అరెస్టు చెయ్యగా... జైలులోనే చనిపోయారు.