YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

 అంగన్ వాడీల ద్వారా పోషకాహారం : మంత్రి సత్యవతి

 అంగన్ వాడీల ద్వారా పోషకాహారం : మంత్రి సత్యవతి

 అంగన్ వాడీల ద్వారా పోషకాహారం : మంత్రి సత్యవతి
హైదరాబాద్‌ డిసెంబర్ 16 
తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌)లో బాలామృతం ప్లస్‌ పథకాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి యూనిసెఫ్‌ దక్షిణ రాష్ర్టాల చీఫ్‌ మిషల్‌ రస్డియా, మహిళా - శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. జగదీశ్వర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ అనురాధ, ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హేమలత, యూనిసెఫ్‌ న్యూట్రిషన్‌ స్పెషలిస్టు డాక్టర్‌ క్యాతి తివారితో పాటు పలువురు పాల్గొన్నారు. ఇవాళ ప్రారంభించిన బాలామృతం ప్లస్‌ పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా మొదట ఆసిఫాబాద్‌, గద్వాల్‌ జిల్లాలో అమలు చేయనున్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలు, బాలికల కోసం మన రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. సీఎం కేసీఆర్ ఒక తండ్రిలా ఆలోచించి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉండాల్సిన స్థాయిలో తల్లులు బరువు, ఎత్తు లేరు అని సర్వేలు చెబుతున్నాయి. తల్లులు ఆరోగ్యంగా లేకపోవడం వల్ల పిల్లలు కూడా అలాగే ఉండే ప్రమాదం ఉంది. దీన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ పిల్లలు పుట్టిన తర్వాత కాకుండా బిడ్డ గర్భంలో ఉన్నపుడే వారికి పోషకాహారాన్ని అందించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే తల్లులు పనిచేయకుండా ఉండాలని వారికి నెలకి2 వేల చొప్పున 6 నెలల పాటు 12వేల రూపాయలు, ప్రసవం తర్వాత కేసీఆర్ కిట్ ఇస్తున్నారు. వీటితో పాటు అంగన్వాడీ ల ద్వారా పోషకాహారాన్ని, కావలసిన మందులు కూడా అందిస్తున్నారు. గర్భిణీ స్త్రీలు నొప్పులు రాగానే ప్రభుత్వ హాస్పిటల్ లో ప్రసవం జరిగేలా అమ్మ ఒడి వాహనం పెట్టి తీసుకొస్తున్నారు. ఆ తర్వాత ఆస్పత్రి నుంచి మళ్ళీ ఇంటికి అదే వాహనంలో జాగ్రత్తగా చేర్చుతున్నారు. మనం ఈరోజు బాలామృతం ప్లస్ విడుదల చేయడమే కాకుండా దీనిని సమర్థవంతంగా లబ్దిదారులకు అందించాలి. ఈ పనిలో అందరిని భాగస్వామ్యం చేయాలి అని మంత్రి సత్యవతి పిలుపునిచ్చారు.

Related Posts