YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఆందోళన 

పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఆందోళన 

పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఆందోళన 
జగిత్యాల డిశంబర్ 16
జిల్లా కేంద్రంలో
పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం జిల్లాలోని పసుపు రైతులు జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ మీదుగా ఐఎంఏ భవనం వరకు పాదయాత్ర చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఆనంతరం జగిత్యాల కరీంనగర్ రహదారి పై రాస్తారోకో నిర్వహించి. నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించడంతో రాకపోకలను తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఇరువైపులా పెద్ద ఎత్తున భారీ వాహనాలు నిలిచిపోయాయి.పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రాస్తారోకోను విరమింప చేసి ట్రాఫిక్ ను పునరుదరించారు.ఆనంతరం రైతులు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గోన అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పసుపు బోర్డు ఏర్పాటు ఈ విషయంలోహామీ ఇచ్చిన నిర్లక్ష్యంగా  వహరించిందన్నారు. తదుపరి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు ఏర్పాటుకు హామీ ఇవ్వడంతో రైతులంతా ఒకే తాటిపై నిలిచి గెలిపించాలని, అర్వింద్ గెలిచినప్పటికీ పసుపు బోర్డు ఏర్పాటు చేయడం కోసం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రైతులు పేర్కొన్నారు.ఆనంతరం జగిత్యాల నుంచి నిజామాబాద్ జిల్లా లోని ఆర్మూర్ కు పాదయాత్ర గా రైతులు తరలివెళ్లారు.

Related Posts