YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నవ్వుకోండి

హనుమంతుడు తెచ్చిన సంజీవని మూలిక టి.ఎ. బిల్లు ఆడిటర్ మూడు కారణాలతో రిజక్ట్ చేశాడు!!

హనుమంతుడు తెచ్చిన సంజీవని మూలిక టి.ఎ. బిల్లు ఆడిటర్ మూడు కారణాలతో రిజక్ట్ చేశాడు!!

రామ రావణ యుద్ధం తర్వాత హనుమంతుడు సంజీవని మూలిక తెచ్చినందుకు తనకు టి.ఎ. బిల్లు ఇవ్వమని అకౌంట్స్ సెక్షను లో బిల్లు  సబ్మిట్‌ చేశాడు. దానికి ఆడిటర్ మూడు కారణాలతో రిజక్ట్ చేశాడు.

1) హనుమంతుడు వెళ్ళేముందు అప్పుడు రాజు భరతుడి పర్మిషన్‌ లేదు.

2) హనుమంతుడు గ్రేడ్-2 ఆఫీసర్ అతను గాలిలో ప్రయాణించుటకు అనుమతిలేదు.

౩) సంజీవని మూలిక తెమ్మంటే సంజీవని పర్వతం తెచ్చాడు కనుక అనుమతి లేకుండా అదనపు లగేజి తెచ్చాడు కనుక టి.ఎ. ఇవ్వడానికి కుదరదు.

దీనికి హనుమంతుడు విచారించి రామున్ని వేడుకున్నాడు రాముడు అకౌంట్స్ సెక్షన్‌ ను పునపరీశిలించమన్నాడు.

హనుమంతుడు నారదుని సలహా మేరకు అకౌంటెంట్ కు టి.ఎ.బిల్లులో 20% కమీషన్ ఇస్తా అనగానే బిల్లును క్రింది కారణాలతో చెల్లించారు.

1) హనుమంతుడు వెళ్ళినప్పుడు భరతుడు రాజు అయినప్పటికీ రాముని చెప్పులు రాజ్యం ఏలుతున్నవి కావున రాముడే రాజు. కాబట్టి రాముని పర్మిషన్ ఉంది ఇవ్వవచ్చు.

2) అత్యవసర సమయంలో అధికారి అనుమతితో గ్రేడ్-2 ఉద్యోగి వాయు ప్రయాణం చేయవచ్చును.

౩) సంజీవని పర్వతం ఎక్స్ ట్రా లగేజి కాదు ఎందుకంటే హనుమంతునికి మూలిక తెలియక పొరపాటున వేరొకటి తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళడం కన్నా ఒకేసారిలో పని పూర్తి అయింది.

ఈ వివరణతో హనుమంతుని బిల్లు పాసయ్యంది. 

రాముడు షాక్స్... 
అకౌంట్స్‌ డిపార్టుమెంటు రాక్స్...

హ్యాపి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్.

Related Posts