YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

డోలా వీరాంజనేయ స్వామి. పక్క చూపులు

డోలా వీరాంజనేయ స్వామి. పక్క చూపులు

డోలా వీరాంజనేయ స్వామి. పక్క చూపులు
ఒంగోలు, డిసెంబర్ 17,
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పార్టీ మారడం ఖాయమని తేలిపోయింది. అయితే ఆయన తగిన సమయం కోసం వేచి చూస్తున్నారు. ఆ నియోజకవర్గంలో అనుచరుల దగ్గర నుంచి సన్నిహితుల వరకూ అంతా ఆ ఎమ్మెల్యే పార్టీ మారతారని బాహాటంగా చెబుతున్నా ఆయన మాత్రం పెదవి విప్పడం లేదు. ఆయనే ప్రకాశం జిల్లా కొండపి శాసనసభ్యుడు డోలా బాల వీరాంజనేయ స్వామి. గత ఎన్నికల్లో డోలా బాల వీరాంజనేయ స్వామి టీడీపీ నుంచి విజయం సాధించారు.డోలా బాల వీరాంజనేయ స్వామి 2014, 2019 ఎన్నికల్లో వరసగా విజయం సాధించారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోవడంతో డాలా బాల వీరాంజనేయ స్వామిపై అనుచరుల నుంచి వత్తిడి పెరిగింది. తన సన్నిహితులు, ముఖ్య అనుచరులు కేసుల్లో ఇరుక్కోవడంతో ఆయన అధికార పార్టీలో చేరడమే మంచిదని భావిస్తున్నారు. డోలా బాల వీరాంజనేయస్వామి ఇటీవల వైసీపీ నేతలతో చర్చలు కూడా జరిపారు. వంశీ వ్యవహారం తర్వాత వైసీపీలో నేరుగా చేరకపోయినా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసే యోచనలో డోలా బాలవీరాంజనేయ స్వామి ఉన్నట్లు తెలుస్తోంది.కొండపి నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం కావడంతో ఇక్కడ టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్థన్ కుటుంబం పట్టు ఎక్కువగా ఉంటుంది. డోలా బాలవీరాంజనేయ స్వామి పార్టీ మారతారని తెలుసుకున్న దామచర్ల తన కుటుంబ సభ్యులతో ఆయనను వారించినట్లు తెలిసింది. అయితే తనకు ప్రస్తుతం అనుచరులను రక్షించుకోవడమే ముఖ్యమని డోలా వివరించినట్లు సమాచారం. వైసీపీ కూడా డోలా బాల వీరాంజనేయస్వామిని పార్టీలోకి ఆహ్వానించింది. మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి మాట్లాడి ఒప్పించారని చెబుతున్నారు.అందుకోసమే 2019 ఎన్నికల్లో డోలా బాల వీరాంజనేయ స్వామిపై పోటీ చేసిన మాదాసు వెంకయ్యకు డిసీసీబీ ఛైర్మన్ పదవి ఇచ్చారంటున్నారు. వెంకయ్యకు ఈ పోస్టు ఇవ్వడం ద్వారా డోలాను పార్టీలోకిి రప్పించడానికి రెడీ చేశారంటున్నారు. వైసీపీలోకి డోలా బాల వీరాంజనేయస్వామి చేరకపోయినా వల్లభనేని వంశీ తరహాలోనే ఆయనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తిస్తారన్న హామీ కూడా వైసీపీ నేతలు ఇవ్వడంతో ఆయన పార్టీని వీడేందుకు ముహూర్తం కోనం వేచి చూస్తున్నారు. అంతా కుదిరితే ఈ అసెంబ్లీ సమావేశాల్లోపే డోలా బాలవీరాంజనేయ స్వామి టీడీపీని ఖచ్చితంగా వీడే అవకాశాలున్నాయి.

Related Posts