డిసెంబర్ 26వ తేదీన కంకణ సూర్య గ్రహణం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర మార్గశిర అమావాస్య తేదీ డిసెంబర్ 26 గురువారం 2019 న సూర్య గ్రహణం భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది.
"ధనస్సు" రాశి మూల నక్షత్రం "మకర , కుంభ" లగ్నాలలో కేతుగ్రస్త కంకణ సూర్య గ్రహణం సంభవించును.ఈ గ్రహణం భారతదేశంతో పాటు ఆసియా , ఆస్ట్రేలియా ఖండాలలో కనబడును .
ఖగోళంలో ఈ గ్రహణం 3 గంటల 39 సెకండ్లు ఉంటుంది. కర్ణాటక , తమిళనాడు ,కేరళలోని కొన్ని ప్రాంతాలలో కంకణోక్త సంపూర్ణ సూర్య గ్రహణం వేర్వేరు సమయాలలో ఉండును . పై మూడు రాష్టాలు మినహాయించి మిగిలిన తెలంగాణ ,ఆంద్రప్రదేశ్ తో పాటు భారతదేశంలోని ఇతర రాష్టాలన్నింటిలో పాక్షిక సూర్యగ్రహణం గోచరిస్తుంది. హైదరాబాదులో ఉదయం 8 :08 నిముషాలకు సూర్యగ్రహణ స్పర్శ ప్రారంభమై మధ్యకాలం 9:30 చేరుకుంటుంది. ఉదయం 11 :10 నిమిషాలకు " పుణ్యకాలం " ముగుస్తుంది. గ్రహణ సమయంలో సూర్యుడు అగ్నివలయంలాగా గ్రహణం చుట్టూ కనపడతాడు.కేరళలోని చెరువుత్తూర్ లో దేశంలో అన్ని ప్రాంతాల్లో కంటే సూర్య గ్రహహణ దృశ్యం సుందరంగా ఉండబోతోంది. ప్రపంచంలో అతికొద్ది ప్రాంతాల్లో మాత్రమే ఇంత స్పష్టంగా సూర్యగ్రహణం కనిపిస్తుంది. సూర్యగ్రహణం వీక్షించే సమయంలో అద్దాలు లేకుండా కంటితో చూడవద్దని హెచ్చరిక . సూర్యుడికి , భూమికి మధ్య చంద్రుడు ప్రవేశించడంతో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ ఏడాది సూర్యగ్రహణం, చంద్రుడు సూర్యుడికి మధ్యలో నుండి అంచులో అగ్నివలయంలాగా కనిపిస్తాడు. భారతదేశంలోనే కాకుండా , సౌదీ అరేబియా, సుమత్రా, బార్నియో లాంటి ప్రాంతాల్లో కూడా సూర్య గ్రహణం దర్శనమిస్తుంది. ఎవరైన గ్రహణాన్ని గ్రహణ సమయంలో ప్రత్యక్షంగా చూడ కూడదు . గర్భవతులు ఎలాంటి భయందోళనలు చెందనవసరం లేదు . గ్రహణ సమయంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ధ్యానం ,జపం , ఆధ్యాత్మిక చింతనతో ఉంటే చాలా మంచిది . మార్గశిర అమావాస్య నాటి అబ్ధిక కార్యక్రామాన్ని యధావిధిగా అపరాన్నకాలంలో జరుపుకోవచ్చును . గ్రహణ పట్టు , విడుపు మధ్యస్నానాలాచరించే వారు , వారికున్న మంత్రనుష్టానములతో ఆచరించి యధావిధిగా స్నానాదులు ఆచరించి నిర్విహించవచ్చును . గ్రహణం గురించి ఎవరూ ఎలాంటి భయం కాని అందోళన కాని చెందవద్దు . గ్రహణం ముగిసిన తర్వాత ఇల్లు శుభ్రంగా కడుక్కొని , స్నానం చేసే నీళ్ళలో చిటికెడు పసుపు,ఒక 'టి' స్పూన్ పచ్చి ఆవుపాలు, రెండు హారతి కర్పూరం బిల్లలను చూర్ణం చేసుకుని నీళ్ళలో వేసుకుని తల స్నానం చేసుకోవాలి.ఆ తర్వాత ఇంట్లో ఉన్న పూజాగదిని శుభ్రపరచుకుని గాయత్రి ( జంధ్యం ) ని మార్చుకుని , పూజ మందిరంలో ఉన్న దేవత విగ్రహాలకు ,యంత్రాలకు శుద్ధమైన నీళ్ళలో చిటికెడు పసుపు వేసి దేవుని విగ్రహాలు,యంత్రాలను ప్రోక్షణ చేసిన తరవాత దీపారాధన అలంకరణం చేసి నైవేద్య నివేదన కొరకు బెల్లంతో చేసిన మరమాన్నం వండి దేవునికి నివేదన చేసి హారతి ఇచ్చి మనస్సును ప్రశాంతగా ఉంచుకుని మూడు ప్రదక్షిణలు నిధానంగా చేసి తమకున్న సమస్త గ్రహాదోష నివారణ కలిగించమని సాష్టాంగా నమస్కారం చేస్తూ విన్నవించుకోవాలి , ఆడవారు సాష్టాంగ నమస్కారం ఎప్పుడు ,ఎక్కడ చేయకూడదు.
ఆడవారు కేవలం మోకాళ్ల పైనే చేయాలి.ముఖ్యంగా గర్భిణిలు నిలబడే నమస్కరించుకోవాలి . ఇంట్లో పూజ పూర్తీ అయిన తర్వాత గుడికి దైవ దర్శనాలకు వెళ్ళే వారు వెళ్ల వచ్చును.మొదట ఇంట్లో పూజ చేయనిది దేవాలయాలకు ఎప్పుడూ వెళ్ళకూడదు.
ఆ రోజు శక్తి కొలది ఆవునకు ఉలవలు ,బెల్లం , అరటి పండ్లు విస్తరి ఆకులో కాని అరటి ఆకులో కాని పెట్టి ఆవుకు తినిపించి మూడు ప్రదక్షిణలు చేస్తే మంచిది. గ్రహాణ దోష పరిహార ప్రక్రియ కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజులైన శాస్త్ర పండితులను సంప్రదించి మీ వ్యక్తిగత జాతక ఆధారంగా ఏమైనా దోషం ఉంటే వారిచ్చే సూచనల మేరకు పరిహార జప,దానాదులను చేసుకోవాలి. నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయ లేదా కొబ్బరి కాయలను గుమ్మంపై నుండి తీసివేసి మళ్లి కొత్త వాటిని అనుభవజ్ఞులైన పండితులచే పూజించి ఇంటికి , వ్యాపార సంస్థలకు కట్టుకోవాలి . గ్రహణం తర్వత మనం ఇంటి రక్షణ కోసం కట్టిన గుమ్మడి , కొబ్బరి కాయలు శక్తిని కోల్పోతాయి, కాబట్టి తిరిగి కుంటుబ సభ్యుల శ్రేయస్సు కోరుతూ ఇంటికి , వ్యాపార సంస్థల రక్షణ కొరకు గుమ్మడికాయను కొత్తగా శాస్త్రోక్తంగా "కుష్మాండ" పూజ చేయించుకుని గుమ్మానికి కట్టుకోవాలి సర్వేజనా: సుఖినోభవంతు జై శ్రీమన్నారాయణ.