YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

ఇంకా తగ్గని డెంగీ బాధితులు

ఇంకా తగ్గని డెంగీ బాధితులు

ఇంకా తగ్గని డెంగీ బాధితులు
నల్గొండ, డిసెంబర్ 17,
డెంగీ బాధితులకు జ్వరం తగ్గినా దాని ఎఫెక్ట్‌‌‌‌ ఇంకా తగ్గుతలేదు. దవాఖాన నుంచి ఇంటికి వచ్చినా.. అది మిగిల్చిన సైడ్ ఎఫెక్ట్స్‌‌‌‌తో మళ్లీ దవాఖాన్లకు వెళ్తున్నారు. రాష్ర్టంలో ఈ సీజన్‌‌‌‌లో 12 వేల మందికి డెంగీ సోకినట్టు వైద్యారోగ్యశాఖ లెక్కలు చెబుతున్నా.. జూన్ నుంచి నవంబర్ వరకు ఈ ఆర్నెళ్లలో సుమారు 50 వేల మంది డెంగీ బారిన పడ్డారు. వీళ్లలో చాలా మంది దమ్ము, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, అలసట, ఒళ్లు నొప్పులు, ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్లేట్‌‌‌‌లెట్ కౌంట్ పడిపోవడం వంటి సమస్యలతో డాక్టర్ల దగ్గరకు పరుగులు తీస్తున్నారు. మెడిసిన్ వాడుతూ, మంచి ఫుడ్ తీసుకుంటే ఈ సమస్యలు తగ్గిపోతాయి. కానీ నిర్లక్ష్యం చేస్తే కార్డియాక్ అరెస్ట్ జరిగి గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.డెంగీ వచ్చిన వారిలో ఊపరితిత్తులు, పొట్టలోకి నీరు చేరడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడుతాయి. దీని కారణంగానే దమ్ము, ఆయాసం వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. డెంగీ ఎఫెక్ట్‌‌‌‌తోపాటు, చలి కూడా తోడవడంతో ఎక్కువ మందికి ఈ సమస్య ఎదురవుతోంది. పొట్టలో చేరిన నీటి కారణంగా ఆకలి వేయదు.. సరిగా తినరు. దీంతో అలసటగా ఉండడంతోపాటు, ఎసిడిటీ వచ్చే ప్రమాదం ఉంటుంది. కానీ దవాఖాన్లలో ఖర్చు భరించలేక డెంగీ బాధితుల్లో చాలామంది జ్వరం తగ్గగానే డిశ్చార్జ్ అయ్యారు. మందులు వాడటం మానేశారు. ఇలా పూర్తిగా మెడిసిన్ వాడని వాళ్లలోనే సమస్యలు ఎక్కువగా వస్తాయని డాక్టర్‌‌‌‌‌‌‌‌ కృష్ణప్రసాద్‌‌‌‌ తెలిపారు.డెంగీ వచ్చిన వారిలో ‘బోన్‌‌‌‌ మారో’ డిప్రెషన్‌‌‌‌లోకి వెళ్తుంది. దీంతో రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. దీని కారణంగా ప్లేట్‌‌‌‌లెట్ కౌంట్‌‌‌‌ పడిపోతుంది. మెడిసిన్, ఫ్లూయిడ్స్‌‌‌‌ ఇవ్వడం ద్వారా క్రమేణా బోన్‌‌‌‌ మారో యాక్టివ్ అవుతుంది. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవాళ్లలో జ్వరం లేకున్నా ఉన్నట్టుండి ప్లేట్‌‌‌‌లెట్స్ తగ్గిపోతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో బీపీ తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీన్నే ‘డెంగీ షాక్ సిండ్రోమ్’ అంటారని నిమ్స్ రెసిడెంట్ డాక్టర్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌ వివరించారు. ‘‘ప్లేట్‌‌‌‌లెట్ కౌంట్ తగ్గిపోవడం వల్ల శరీరంపై ఎర్రటి దద్దుర్లు ఏర్పడుతాయి. ఇవి క్రమేణ నల్ల మచ్చలుగా మారుతాయి. ఒకట్రెండు నెలల తర్వాత తగ్గిపోతాయి. డెంగీ తగ్గినా, 3 నెలల వరకూ బోన్, జాయింట్స్ పెయిన్స్ వస్తున్నాయి. డెంగీ తర్వాత రెస్ట్ తీసుకోని వాళ్లలో ఈ సమస్య ఇంకా ఎక్కువ కాలం ఉంటుంది” అని చెప్పారు.తెలంగాణలో డెంగీతో ఆరుగురు చనిపోయినట్లు పార్లమెంట్‌‌‌‌లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. దేశంలో డెంగీ కేసులు, మరణాలపై ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌ నాటికి దేశంలో 91,457 డెంగీ కేసులు, 82 మరణాలు నమోదైనట్టు పేర్కొన్నారు. అయితే రాష్ర్టంలో వంద మందికిపైగా డెంగీతో మరణించినట్టు డాక్టర్లు అంచనా వేస్తున్నారు. ఈ మరణాల లెక్క తేల్చేందుకు ప్రభుత్వం కమిటీ వేసినా.. ఇప్పటిదాకా ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదు.

Related Posts