దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై టీఆర్ఎస్లో భిన్నమైన వ్యాఖ్యలు
హైదరాబాద్ డిసెంబర్ 17
: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై టీఆర్ఎస్లో భిన్నమైన వ్యాఖ్యలు వ్యక్తమవుతున్నాయి.తాజాగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిందితుల ఎన్కౌంటర్లో కోర్టుల తీరు సరికాదన్నారు. పోలీసుల మనో ధైర్యాన్ని దెబ్బతీయొద్దని పేర్కొన్నారు. ప్రజలు కోరుకున్నదే పోలీసులు చేశారని విద్యాసాగర్‌రావు స్పష్టం చేశారు. అయితే ఎన్‌కౌంటర్‌ను మంత్రి ఈటల, విప్ గొంగిడి సునీత తప్పుబట్టడం గమనార్హం.