YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గవర్నర్ పర్యటన ఏర్పాట్లు

గవర్నర్ పర్యటన ఏర్పాట్లు

గవర్నర్ పర్యటన ఏర్పాట్లు
కర్నూలు, డిసెంబర్ 17, 
ఈ నెల  22వ తేదీన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందస్ శ్రీశైలం, కర్నూలు మోడికల్ కాలేజిలో నిర్వహించే మొక్కలు నాటే కార్యక్రమం, రక్షదాన శిబిరం, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహావిష్కరణ, మోడికల్ కళాశాల పూర్వ విద్యార్ధుల సెలబ్రేషస్ కార్యక్రమాలకు హాజరవుతున్నట్లు జాయింట్  కలెక్టర్ 2 సయ్యద్ కాజా మోహిద్దీస్ తెలిపారు. మంగళవారం  స్థానిక జాయింట్ కలెక్టర్ -2 చాంబర్ లో కర్నూలు మోడికల్ కళాశాల డిపార్ట్మెంట్ అధికారులతో  సమీక్ష నిర్వహించారు. మోడికల్ కళాశాలలో న్యూలెక్షర్ గ్యాలరీ లో ఏర్పాటు చేసే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రాహం ప్రారంభోత్సవంలో రిమోట్ కంట్రోల్ ఉండేలా చర్యలు చేపట్టాలని మోడికల్ కళాశాల అధికారులకు జాయింట్ కలెక్టర్ -2 ఆదేశించారు.  అలాగే ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆల్ మనీ సెలబ్రేషన్స్ సమావేశంలో ఎటువంటి తప్పులు దొర్లకుండా  ముందుస్తుగా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. పొడియం, స్టేజి ఏర్పాట్లు పూలతో బాగా అలంకరించాలి అన్నారు. విద్యుత్ సరఫరా అంతరాయం కలిగితే వెంటనే జనరేటర్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్—2 కర్నూలు మోడికల్ కళాశాలలో గవర్నర్ పర్యటన ప్రదేశాలను పరిశీలించారు. కళాశాల ఆవరణంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పార్కింగ్ స్థలము కేటాయించాలన్నారు. గవర్నర్ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ప్లాంటేషన్ ఏర్పాలు చేసుకోవాలని మోడికల్ ప్రిన్సిపల్ కు సూచించారు. అదేవిధంగా రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రదేశాన్ని పరిశీలించి  తగు సలహాలు సూచనలు ఇచ్చారు. మోడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్, మోడికల్ కళాశాల ఏడి అనిల్ కుమార్ రెడ్డి, కర్నూలు ఆర్డిఓ వెంకటేశు, కల్లూరు ఎమ్మార్వో రవి జాయింట్ కలెక్టర్ వెంట ఉన్నారు.

Related Posts