YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గివ్ ఫర్ సొసైటీ వారి అధ్వర్యంలో   బ్లాంకెట్స్ పంపిణీ కార్యక్రమం

గివ్ ఫర్ సొసైటీ వారి అధ్వర్యంలో   బ్లాంకెట్స్ పంపిణీ కార్యక్రమం

గివ్ ఫర్ సొసైటీ వారి అధ్వర్యంలో   బ్లాంకెట్స్ పంపిణీ కార్యక్రమం
ఆసిఫాబాద్ డిసెంబర్ 17 
గివ్ ఫర్ సొసైటీ మరియు ప్రజా బంధు స్వర్గీయ శ్రీ పాల్వాయి పురుషోత్తమరావు గారి మెమోరియల్ ఫౌండేషన్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న బ్లాంకెట్స్ పంపిణీ కార్యక్రమంలో దహేగాం మండల కేంద్రంలోని లోహ గ్రామస్తుల వృద్దులకు, మహిళలకు బ్లాంకెట్స్ పంపిణీ చేసిన సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డా పాల్వాయి హరీష్ బాబు. అనంతరం గ్రామస్తులనుద్దేశించి మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ భవిష్యత్ లో ఇలాంటి ప్రజా కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని, వైద్య సహాయం కోసం  అవసరం ఉన్నప్పుడు తనను సంప్రదిస్తే తప్పకుండా సహాయం చేస్తానని చెప్పారు. ఖర్జి గ్రామ పంచాయితీ కి లోహ గ్రామం దట్టమైన అటవీ ప్రాంతంలో 5 కిలోమీటర్ల దూరం ఉంది. వీరికి లోహ గ్రామానికి వెళ్ళడానికి రహదారి లేదు. కరెంట్ పోల్స్ లేకపోవడం వలన అడవిలో చెట్లు పడటం వలన అప్పుడప్పుడు కరెంట్ ఉండడం లేదని, సరైన త్రాగునీటి వసతి లేదని గ్రామస్తులు హరీష్ బాబు కు విన్నవించారు. లోహ గ్రామ రోడ్డు మరియు కరెంట్ సౌకర్యం గురించి కలెక్టర్ మరియు పై అధికారులతో మాట్లాడతానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ  డిసిసి ఓబీసీ చైర్మన్ దాసరి వెంకటేష్ ,దహేగాం ఎంపీటీసీ జయ - దనుంజయ, కర్జీ సర్పంచ్ ఎల్కారి సంజీవ్, బక్కన్న, దామన్న, చంద్రపల్లి సర్పంచ్ దామోదర్, మాజీ ఎంపిటిసి సోమా శేఖర్, దందేరా శంకర్, షాకిర్, ప్రభాకర్ గౌడ్, మల్లగౌడ్, బాపు, వెంకన్న, రామన్న, రోషన్, ఇస్తారి, వెంకన్న, మహేష్, దిలీప్, కేదార్, రాజు, కృష్ణ, గణేష్, అంకుష్, జంపేష్ మరియు గ్రామస్థులు పాల్వాయి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Related Posts