మద్యం రేట్లు పెంపు పై కాంగ్రెస్ ఆగ్రహం
హైదరాబాద్ డిసెంబర్ 17రాష్ట్రంలో మద్యం ధరలు పెంపు పై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ శాఖ ను కాస్తా ,ఆదాయం తెచ్చి పెట్టే శాఖ గా ప్రభుత్వం చూస్తుందని కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. మద్యాన్నిఅరికట్టాల్సిన ప్రభుత్వమే విచ్చలవిడిగా పరిమితులు ఇచ్చి ,రేట్లు పెంచి మద్యం అమ్మకాలలో రాష్ర్టాన్ని మొదటి స్థానంలో నిలిపిన ఘనతటిఆర్ఎస్ప్రభుత్వానిదేనని అన్నారు. ఒక వైపు క్రైం రేటు తగ్గిస్తామని చెప్తూ ,క్రైం కుకారణమయ్యే మద్యాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్రెడ్డిమాట్లాడుతూప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ను కాస్తా .ఆదాయాన్ని సమకూర్చే శాఖ గా ఈ ప్రభుత్వం మార్చిందని ,ఆదాయం సమకూర్చే శాఖ గా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖను ప్రభుత్వంచూసినన్ని రోజులు రాష్ట్రంలో క్రైం రేటు తగ్గే అవకాశం లేదని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అనేక అనార్దాలకు కారణం మద్యం మాత్రమమేనని, అలాంటి మద్యాన్ని ప్రభుత్వం ఎందుకు నియంత్రణ చేయట్లేదని ప్రశ్నించారు. రోజు కూలి పనిచేసుకునే వారి పైనా ప్రభుత్వం భారం వేసిందని పేద ప్రజలు, చిన్న రైతులు సేవించే చీప్ లిక్కర్ లాంటి మద్యం పై కూడా రేట్లు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మద్యం అమ్మకాల పై రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు సూచనలు చేసారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. వైన్ షాపులు తెరిచి ఉండే సమయవేళల్లో మార్పు చేయాలని, మధ్యాహ్నం 12నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే వైన్షాపులు తెరచి ఉంచాలని డిమాండ్ చేసారు... ప్రధాన రోడ్ల పై మధ్యం షాపులకు పర్మిషన్ ఇవ్వొద్దని..గ్రామాల్లో డ్రంక్ డ్రైవ్ పెట్టొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మద్యం అమ్మకాల పై దీర్ఘకాలిక నియంత్రణ అమలు చేయడం తోపాటు స్వల్పకాలిక వ్యూహాన్ని అమలు చేయాలని సూచించారు. అన్ని విషయాలతో ఇతర రాష్టాలతో పోల్చుకునే కేసీఆర్ , ఏపీ లో మద్య నియంతనకు తీసుకునే చర్యల విషయంలో మన రాష్ర్టాన్ని ఎందుకు పోల్చుకోవట్లేదని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.. మరి కాంగ్రెస్ నేతల విమర్శలకుటిఆర్ఎస్ నేతలు ఎం సమాధానం చెప్తారో.